నిరసనల వంటావార్పు | - | Sakshi
Sakshi News home page

నిరసనల వంటావార్పు

Sep 5 2026 5:37 AM | Updated on Sep 5 2026 5:37 AM

కరీంనగర్‌టౌన్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ప్రజాసమస్యలు పరిష్కారం కావడంలేదని, ఇందుకు నిరసనగా బీఆర్‌ఎస్‌ నగరశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ‘వంటావార్పు’ చేపట్టారు. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కమలాకర్‌ మాట్లాడుతూ మహిళలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి కింద రూ.లక్ష, తులం బంగారం ఇస్తామని అబద్ధపు హామీలిచ్చి మోసం చేసిందన్నారు. ఆడబిడ్డలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామందని, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, నేడు ఆ హామీలను గాలికి వదిలేసిందన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్‌రెడ్డి, పొన్నం అనిల్‌ కుమార్‌గౌడ్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, సుధగోని మాధవి, గాదె రూప, యూసుఫ్‌ అలీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement