సంబరాల బైక్‌ ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

సంబరాల బైక్‌ ర్యాలీ

Sep 5 2026 5:37 AM | Updated on Sep 5 2026 5:37 AM

సంబరాల బైక్‌ ర్యాలీ

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ప్రజాపాలనతో ప్రతి ఇంటా వెలుగులు వచ్చాయని కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి వేయిరోజులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం నగరంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఇందిరాచౌక్‌ వద్ద సంబరాలు జరిపారు. బైక్‌ర్యాలీ రాజీవ్‌చౌక్‌,గాంధీచౌక్‌, బాబు జగ్జీవన్‌రామ్‌ చౌక్‌ మీదుగా అంబేడ్కర్‌చౌక్‌ వరకు సాగింది. అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సత్తు మల్లేశం, సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, పురుమల్ల శ్రీనివాస్‌, వుట్కూరి నరేందర్‌రెడ్డిలతో కలిసి అంజన్‌కుమార్‌ మాట్లాడారు. రాష్ట్రంలో ఫాంహౌస్‌ పాలన పోయి కాంగ్రెస్‌ ప్రజాపాలన వచ్చి వేయి రోజులైందన్నారు. ప్రజలు ప్రజాపాలనను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారని పేర్కొన్నారు. ఏఎంసీ చైర్మన్‌ ఆకుల నర్సయ్య, ఆకారపు భాస్కర్‌రెడ్డి, చాడగొండ బుచ్చిరెడ్డి, నర్సింగం, జగన్‌రెడ్డి, అజయ్‌గౌడ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement