కరీంనగర్‌టౌన్: కార్ఖానాగడ్డలోని ప్రభుత్వ వసతిగృహాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ చిత్రామిశ్రా తెలిపారు. మంగళవారం సాయంత్రం వసతి గృహాన్ని సందర్శించారు. వృద్ధులు, దివ్యాంగుల సమస్యలను తెలుసుకున్నారు. జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, వార్డెన్ రాధిక, స్వప్న పాల్గొన్నారు.
కష్టపడి చదువుకోండి
కరీంనగర్ రూరల్: నగునూరులోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను కలెక్టర్ చిత్రామిశ్రా తనిఖీ చేశారు. వంటలను పరిశీలించారు. స్టోర్ రూం సందర్శించి కూరగాయలు, పండ్లు, ఇతర సామగ్రిని పరిశీలించారు. విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడారు. ‘ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, భోజనం బాగుంటుందా, మెనూ ప్రకారం పెడుతున్నారా. చదువు ఎలా సాగుతోంది, యూనిఫామ్స్, పుస్తకాలు వచ్చాయా’ అంటూ ఒక్కో అంశంపై అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ మాలతి, సిబ్బంది పాల్గొన్నారు.


