ఎమ్మెల్యే పీఏ వేధింపులతోనే ఆత్మహత్యకు యత్నించా | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే పీఏ వేధింపులతోనే ఆత్మహత్యకు యత్నించా

Sep 4 2026 7:53 AM | Updated on Sep 4 2026 7:53 AM

కరీంనగర్‌టౌన్‌: మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పీఏ మురళీదర్‌రెడ్డి తనపై అట్రాసిటీ కేసులు పెట్టించి జైలుకు పంపించాలని చూస్తున్నారని, అది భరించలేకనే తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని సిద్దిపేట జిల్లా, బెజ్జంకి మండలం గుండారం గ్రామానికి చెందిన మెట్ట నాగరాజు ఆరోపించాడు. కరీంనగర్‌లో మంగళవారం మాట్లాడుతూ తాను పదేళ్ల నుంచి కాంగ్రెస్‌ పార్టీలో ఉంటున్నానని, ఈ మధ్యకాలంలో జెన్‌జీ వాట్సాప్‌ గ్రూప్‌లో కొన్ని పోస్టులు పెట్టినందుకు ఎమ్మెల్యే కవ్వంపల్లి పీఏ మురళీధర్‌ రెడ్డి తనపై దుష్ప్రచారం చేసుకుంటా, అక్రమ కేసులు పెట్టించి జైలుకు పంపించాలని చూస్తున్నాడని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కేసుల పేరిట గన్నేరువరం పోలీస్‌స్టేషన్‌ నుంచి ప్రతిరోజు ఫోన్‌ చేయిస్తున్నాడని తెలిపాడు. దాంతో తాను భయాందోళనకు గురై ఆత్మహత్య చేసుకుందామనుకున్నది వాస్తవేనన్నాడు. అంతకుముందు నాగరాజు మానకొండూరు నియోజకవర్గ జెన్‌జీ వాట్సాప్‌ గ్రూపులో తాను మురళీధర్‌ రెడ్డి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ మెసేజ్‌ పెట్టి ఫోన్‌ స్విచాఫ్‌ చేసుకున్నాడు. కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు తీవ్రంగా గాలించి నాగరాజు ఆచూకీ కనుగొన్నారు. ఈ ఘటనపై విచారిస్తున్నామని సీపీ గౌస్‌ ఆలం తెలిపారు. కాగా.. గత నెలలో గుండ్లపల్లి మాజీ సర్పంచ్‌ భర్త రాజేందర్‌రెడ్డి ఆత్మహత్య కేసులో మురళీధర్‌ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

అట్రాసిటీ కేసు పెట్టేందుకు చూస్తున్నారన్న నాగరాజు

‘జెన్‌ జీ’ వాట్సాప్‌ గ్రూపులో మెసేజ్‌తో కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement