సిటీలో ఫ్లెక్సీల రగడ | - | Sakshi
Sakshi News home page

సిటీలో ఫ్లెక్సీల రగడ

Sep 4 2026 2:18 AM | Updated on Sep 4 2026 2:18 AM

బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌

ఎదుటి పార్టీ వైఫ్యల్యాలపై పోటాపోటీగా ఫ్లెక్సీలు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య ఫ్లెక్సీల రగడ మొదలైంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి వేయి రోజులు పూర్తయిన సందర్భంగా సంబరాలు నిర్వహిస్తుంటే, మరో వైపు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పోరుబాట చేపట్టడం తెలిసిందే. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ క్యాంప్‌ కార్యాలయం ఎదుట ‘కాంగ్రెస్‌ 420 మోసాలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట’ పేరిట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇందుకు ప్రతిగా మరో వైపు ‘10 ఏండ్ల బీఆర్‌ఎస్‌ పాలన అంతా దోపిడీయే’ పేరిట కాంగ్రెస్‌ నగరంలోని ముఖ్యకూడళ్ల వద్ద గురువారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఇలా...బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఎదుటి వారి వైఫల్యాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు సిటీలో హాట్‌టాపిక్‌గా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement