తెలుగు అక్షరాలతో చీర | - | Sakshi
Sakshi News home page

తెలుగు అక్షరాలతో చీర

Sep 4 2026 2:18 AM | Updated on Sep 4 2026 2:18 AM

బాసర: సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల జగదీశ్వర్‌ రూపొందించిన తెలుగు అక్షరాల చీరను బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారికి శుక్రవారం సమర్పించనున్నారు. జగదీశ్వర్‌ ఈ చీరను స్వయంగా నేశాడు. తెలుగుభాషపై ఉన్న అభిమానం, చేనేత కళపై తనకున్న ఆసక్తికి ప్రతీకగా చీర నేసినట్లు తెలిపాడు. అమ్మవారికి సమర్పించే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నాడు. తెలుగు అక్షరాలతో రూపొందించిన చీర భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

పోలీసుల సంరక్షణలో బాలుడు

జ్యోతినగర్‌: తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన ఓ బాలుడు ఎన్టీపీసీ పోలీసుల సంరక్షణలో ఉన్నాడు. బాలుడి పేరు మహేశ్‌ (తండ్రి పేరు సమ్మయ్య) అని, బాలుడిని గుర్తించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరుతున్నారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు 8712656526 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.

సంకెపల్లిలో చోరీ

వేములవాడఅర్బన్‌: వేములవాడ మండలం సంకెపల్లిలోని పండుగ లచ్చవ్వ ఇంట్లో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు. లచ్చవ్వ ఒక్కతే ఇంట్లో నిద్రిస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్క్‌ ధరించి తలుపుకొట్టారు. తలుపులు తీయకపోవడంతో పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలో ఉన్న రూ.50వేలు ఎత్తుకెళ్లారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వేములవాడ సీఐ వీరప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement