● ఐదుగురు కార్మికులకు గాయాలు
రామగిరి: సింగరేణి సంస్థ అడ్రియాల ప్రాజెక్టు ఏరియా గనిలో గురువారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. ఎఫ్‌బీఎల్ ఎయిర్ ట్యాంకర్ పేలడంతో సమీపంలో ఉన్న ఆపరేటర్ శ్రీనివాస్, హెల్పర్ మనోజ్, ప్రశాంత్, ఫీట్టర్ కిరణ్, యాక్టింగ్ ఫీట్టర్ లక్ష్మణ్‌లు గాయాలపాలయ్యారు. గమనించిన తోటి కార్మికులు సెంటినరికాలనీ సింగరేణి డిస్పెన్సరీకి తరలించారు. మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం గోదావరిఖని ఏరియా అసుపత్రికి తరలించారు. కాగా ఎయిర్ ట్యాంకర్ పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది. ట్యాంకర్‌లో సాంకేతిక లోపం కారణాంగానే పేలుడు సంభవించిందా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే విషయంపై అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది. ఏపీఏ గనిలో తరుచూ ప్రమాదాలు సంభవిస్తుడటంతో కార్మికులు భయాందోళనతో విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రమాదాలు జరుగుతుండటంతో కార్మికులు గైర్హాజరు అవుతున్నారని చర్చించుకుంటున్నారు. అధికారులు భద్రత చర్యలు చేపట్టి కార్మికుల్లో భరోసా నింపాలని కార్మిక నాయకులు కోరుతున్నారు.


