క్షేత్రస్థాయి పునర్నిర్మాణమే పునాది | - | Sakshi
Sakshi News home page

క్షేత్రస్థాయి పునర్నిర్మాణమే పునాది

Sep 4 2026 2:18 AM | Updated on Sep 4 2026 2:18 AM

● పీసీసీ ఆదివాసి సెల్‌ వైస్‌చైర్మన్‌ ఆనంద్‌

● పీసీసీ ఆదివాసి సెల్‌ వైస్‌చైర్మన్‌ ఆనంద్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కాంగ్రెస్‌ పార్టీ విజయానికి క్షేత్రస్థాయి పునర్మాణం అత్యంత కీలకమని పీసీసీ ఆదివాసి సెల్‌ వైస్‌ చైర్మన్‌ ఆనంద్‌ అన్నారు. గురువారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ నాయకత్వంతో మాత్రమే ఎన్నికల్లో గెలవలేమన్నారు. ఏఐసీసీ సంఘటన్‌ సజన్‌ అభియాన్‌ కార్యక్రమం ద్వారా గ్రామ, వార్డు, పోలింగ్‌ బూత్‌ స్థాయి వరకు పటిష్టమైన నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి బూత్‌కు ఒక అధ్యక్షుడితో కమిటీ వేసి, ఆ బూత్‌ పరిధిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో పరిశీలించాలన్నారు. పార్టీ అధ్యక్ష స్థానాలకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్‌నాయక్‌, కుర్ర పోచయ్య, లావుడ్య రంగానాయక్‌, రాజలింగం సూర్య, గుగులోతు గోపి, లావుడియా సుధాకర్‌, మాలోతు మహాలక్ష్మి, సాయినాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement