జమ్మికుంటలో క్వింటాల్‌కు గరిష్టంగా రూ.9,000
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
స్పిన్నింగ్ మిల్లుల్లో దారానికి డిమాండే కారణం
మార్కెట్‌కు తరలుతున్న నిల్వ పత్తి
జమ్మికుంట: మార్కెట్లో పత్తి ధర ౖపైపెకి పాకుతోంది. మార్కెట్లో డిమాండ్ ఏర్పడడంతో నిల్వపత్తికి ధర పలుకుతోంది. గత సీజన్‌లో పత్తి ఉత్పత్తులు తగ్గడం, ప్రస్తుత మార్కెట్‌లో పత్తి గింజల నూనె, స్పిన్నింగ్ మిల్లుల్లో దారానికి(కండి) డిమాండ్ ఏర్పడడంతో పత్తి ధరలు రోజు రోజులకు పెరుగుతున్నాయి. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో బుధ, గురువారాల్లో క్వింటాల్ పత్తి ధర రూ.9వేలు పలికింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిల్వ పత్తికి పెరిగిన డిమాండ్
గత సీజన్‌లో వర్షాలు అధికంగా కురియడంతో పత్తి పూత, పిందె రాలిపోయి దిగుబడి తగ్గింది. ఎకరాకు ఐదు నుంచి ఎనిమిది క్వింటాళ్లే వచ్చింది. బహిరంగ మార్కెట్లో డిమాండ్ లేకపోడం సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేపట్టారు. క్వింటాల్ పత్తికి గరిష్టంగా రూ.8,110, కనిష్టంగా రూ.7,300 పలికింది. 95శాతం పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. ప్రస్తుతం పత్తి గింజల నూనెకు డిమాండ్ ఏర్పడింది. స్పీన్నింగ్ మిల్లుల్లో యారన్ తీసేందుకు సరిపడ పత్తి(దూది) లేకపోవడంతో పత్తికి ధర పలుకుతోంది. దీంతో రైతులు పెట్టుబడి కోసం నిల్వ చేసుకున్న పత్తిని మార్కెట్‌కు తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. మంచి ధర పలుకుతుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన ఆదాయాన్ని వానాకాలం పెట్టుబడికి ఉపయోగిస్తున్నారు.
క్వింటాల్‌కు రూ.9,000
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో గురువారం క్వింటాల్ పత్తికి గరిష్టంగా రూ.9,000 పలికింది. మార్కెట్‌కు ఇద్దరు రైతులు 25క్వింటాళ్లను తీసుకొచ్చారు. ప్రైవేటు వ్యాపారులు కనిష్ట ధర రూ.8,900కు కొనుగోలు చేశారు. శుక్రవారం కృష్ణాష్టమి, శని,ఆదివారాలు సాధారణ సెలవులు ఉంటాయని సోమవారం యథావిధిగా క్రయ విక్రయాలు జరుగుతాయని మార్కెట్ చైర్‌పర్సన్ పూల్లూరి స్వప్న, గ్రేడ్–2 కార్యదర్శి రాజా తెలిపారు.


