ప్లాస్టిక్‌ ఫ్రీ సిటీగా మార్చండి | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ ఫ్రీ సిటీగా మార్చండి

Sep 4 2026 2:06 AM | Updated on Sep 4 2026 2:06 AM

● మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌ను ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకు కృషి చేయాలని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. గురువారం నగరపాలకసంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తు ప్లాస్టిక్‌ నివారణకు ఫంక్షన్‌హాల్స్‌, వ్యాపారసంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పారిశుధ్య పనులపై డివిజన్లలో అకస్మిక తనిఖీలు చేపడతామని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేదీ లేదని హెచ్చరించారు. కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ మాట్లాడుతూ ఎస్‌ఐ, జవానులు ప్రతి రోజు ఉదయం 5 గంటలకు ఫీల్డ్‌లో ఉండి పారిశుధ్య పనులు మెరుగ్గా చేయాలన్నారు. అదనపు కమిషనర్లు ఆయాజ్‌, సువార్త, సహాయ కమిషనర్‌ రాజమనోహర్‌, ఎంహెచ్‌వో సుమన్‌ పాల్గొన్నారు.

సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం

నగరంలోని ప్రతి డివిజన్‌లో ప్రజలకు వసతులు కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ తెలిపారు. నగరపాలకసంస్థ 44వ డివిజన్‌ శ్రీనగర్‌ కాలనీ సంతోషిమాత ఆలయం వద్ద రూ.30 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి గురువారం కార్పొరేటర్‌ చాడగొండ కవిత బుచ్చిరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. 21వ డివిజన్‌ విద్యానగర్‌లో నగరపాలకసంస్థ సాధారణ నిధులతో చేపట్టనున్న బాత్‌రూమ్‌ల నిర్మాణ పనులను కార్పొరేటర్‌ వరాల నర్సింగంతో కలిసి ప్రారంభించారు. 62వ డివిజన్‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి కార్పొరేటర్‌ పెద్దపల్లి శ్రీలేఖ జితేందర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement