మంత్రాల నెపంతో వృద్ధురాలిపై దాడి | - | Sakshi
Sakshi News home page

మంత్రాల నెపంతో వృద్ధురాలిపై దాడి

Sep 1 2026 12:31 AM | Updated on Sep 1 2026 12:31 AM

కొడిమ్యాల: మండలంలోని సూరంపేట గ్రామంలో మంత్రాల నెపంతో వృద్ధురాలిపై దాడి చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. మంత్రాలు చేస్తోందన్న అనుమానంతో గ్రామానికి చెందిన మల్లమ్మ, ఆమె భర్తపై కొందరు గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మల్లమ్మ మంత్రాలు చేయడంతోనే ఓ వివాహిత అనార్యోగానికి గురై ప్రతి పౌర్ణమి రోజు తీవ్రమైన బాధలు అనుభవిస్తోందని ఆమె కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు మల్లమ్మపై దాడి చేసి గాయపరిచారు. తనను చంపుతామని బెదిరిస్తున్నారని మల్లమ్మ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. మూఢనమ్మకాలతో ఇటువంటి దాడులు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

మహిళా మావోయిస్టు రాధక్క మృతి

పెద్దపల్లి : మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ మాజీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్‌రావు అలియాస్‌ చంద్రన్న సహచరి, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కమిటీ సభ్యురాలు కోర్సింగే మోతీబాయి అలియాస్‌ రాధక్క సోమవారం మృతి చెందారని మాజీ మావోయిస్టు తెలిపారు. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 5.55 గంటలకు కన్నుమూశారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆదిలాబాద్‌ మండలం పిప్పల్‌దరి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధవులు తెలిపారు. చివరిచూపుకోసం వచ్చేవారు ఆదిలాబాద్‌ నుంచి కలెక్టర్‌ చౌరస్తా మీదుగా ఎస్‌పీ క్యాంప్‌ ఆఫీస్‌ రోడ్డు గుండా అంకోలి గ్రామం మీదుగా పిప్పల్‌ దరికి చేరుకోవాలని వారు సూచించారు.

యువకుడిపై గొడ్డలితో దాడి

తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మోతె రాజు(18)పై మామిడాల రాజు(26) సోమవారం రాత్రి గొడ్డలితో దాడి చేశాడు. స్థానికుల కథనం ప్రకారం.. మోతె రాజుకు మామిడాల రాజు, మామిడాల అక్కవ్వ(45)లకు మధ్య కొంతకాలంగా వివాదాలు ఉన్నాయి. ఈక్రమంలో సోమవారం రాత్రి మోతె రాజు.. మామిడాల రాజు ఇంటికి వెళ్లగా ఆగ్రహించిన రాజు గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ రాజును స్థానికులు 108 అంబులెన్స్‌ ద్వారా సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement