కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లా వ్యాప్తంగా పాఠశాల స్థాయి నుంచే క్రీడలను పటిష్టం చేసేందుకు, విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు విద్యాశాఖ వేగంగా అడుగులు వేస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని 16 మండలాలకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) మండల సెక్రెటరీలను నియమిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైనీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్రీడల్లో నైపుణ్యం కలిగిన వ్యాయామ విద్యా స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఈ కీలక బాధ్యతలను అప్పగించారు.
10 లోపు పూర్తి చేయాలి
ఎస్జీఎఫ్ మండల కార్యదర్శులుగా నూతనంగా నియామకమైన కార్యదర్శులు ఎస్జీఎఫ్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10 లోపు తమ తమ మండలాల్లో పాఠశాల స్థాయి ఆటల పోటీలు పకడ్బందీగా నిర్వహించాలని డీఈవో ఆదేశించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో ఈ నెలలోనే జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఉత్తమ జట్లను జిల్లా పోటీలకు తీసుకురావాలని సూచించారు.
మండల కార్యదర్శులు వీరే..
మండలం కార్యదర్శి పనిచేస్తున్న పాఠశాల
కరీంనగర్‌అర్బన్ అంతటి శంకరయ్య జీహెచ్‌ఎస్, సప్తగిరికాలనీ
కరీంనగర్‌రూరల్ ఎం.రమేశ్ జెడ్పీహెచ్‌ఎస్, దుర్శేడ్
కొత్తపల్లి గిన్నె లక్ష్మణ్ జెడ్పీహెచ్‌ఎస్, ఎలగందల్
మానకొండూర్ కె.శ్రీనివాస్ జెడ్పీహెచ్‌ఎస్(బా), మానకొండూర్
తిమ్మాపూర్ డి.శోభారాణి జెడ్పీహెచ్‌ఎస్, నుస్తులాపూర్
శంకరపట్నం ఎ.శ్రీనివాస్ జెడ్పీహెచ్‌ఎస్, తాడికల్
హుజూరాబాద్ సీహెచ్.శ్రీనివాస్ జెడ్పీహెచ్‌ఎస్, చెల్పూర్
జమ్మికుంట ఎం.ప్రేమలత జెడ్పీహెచ్‌ఎస్ (బా), జమ్మికుంట
ఇల్లందకుంట బి.సత్యనారాయణ జెడ్పీహెచ్‌ఎస్, సిరిసేడు
వీణవంక పి.శ్రీనివాస్ జెడ్పీహెచ్‌ఎస్, వీణవంక
సైదాపూర్ బి.జ్యోతి జెడ్పీహెచ్‌ఎస్, వెన్నంపల్లి
గన్నేరువరం వి.ప్రవీణ జెడ్పీహెచ్‌ఎస్, గన్నేరువరం
రామడుగు కె.దత్తాత్రి జెడ్పీహెచ్‌ఎస్, వెలిచాల
గంగాధర బి.శ్రీనివాస్ జెడ్పీహెచ్‌ఎస్, గంగాధర
చొప్పదండి కె.కృష్ణ జెడ్పీహెచ్‌ఎస్, చొప్పదండి
చిగురుమామిడి కె.సమ్మయ్య జెడ్పీహెచ్‌ఎస్, చిగురుమామిడి
ఈనెల 10 లోపు మండల స్థాయి పోటీలు
క్రీడా మైదానాల్లో సరికొత్త జోష్


