● ముగ్గురికి స్వల్ప గాయాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధ న్ పీఆర్వో ప్రయాణిస్తున్న కారు సోమవారం ప్రమాదానికి గురైంది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి శివారులోని సత్తెపీరీల దర్గా వద్ద చె ట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వేములవాడ నుంచి కామారెడ్డి వెళ్తుండగా కారు అదుపుతప్పి మూలమలుపు వద్ద చెట్టును ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జయ్యింది. క్షతగాత్రులను కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు.
విద్యుత్ చౌర్యం కేసులో జరిమానా
కొత్తపల్లి(కరీంనగర్): పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బుర్ర సతీశ్‌ను విద్యుత్ చౌర్యం కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు విద్యుత్ విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ సాదుల్లా బాబా, ఎస్సై కళ తెలిపారు. సతీశ్ అక్రమంగా విద్యుత్‌ను వాడుతుండగా అధికారులు పట్టుకొని కరీంనగర్ విజిలెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పెద్దపల్లి కోర్టులో హాజరుపర్చగా నిందితుడికి రూ.4,059 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సునీత కుంచాల సోమవారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తే మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి హెచ్చరించారు.
పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు
సిరిసిల్ల/తంగళ్లపల్లి: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు, రూ.5వేలు జరిమానా విధిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ సోమవారం తీర్పు వెలువరించినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికను జనగాంకు చెందిన యటెల్లి విజయ్ లైంగిక వేధింపులకు గురిచేశారు. బాలిక తల్లి ఫిర్యాదుతో అప్పటి ఎస్సై లక్ష్మారెడ్డి కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. నేరం రుజువు కావడంతో నిందితుడైన యేటల్లి విజయ్‌కు 20 ఏళ్ల జైలు, రూ.5000 జరిమాన విధిస్తూ తీర్పు నిచ్చారు. నిందితుడికి శిక్ష పడేందుకు సమన్వయంతో పని చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఎస్పీ మహేశ్ బీ గీతే అభినందించారు.


