కరీంనగర్‌క్రైౖం: కరీంనగర్ అల్కాపురికాలనీలోని ఓ లాడ్జిలో వేములవాడకు చెందిన నరాల కార్తీక్ (33) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగస్టు 30న పని నిమిత్తం కరీంనగర్ వెళ్తున్నానని భార్యకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన కార్తీక్, ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. సోమవారం లాడ్జి వద్ద అతడి కారు కనిపించడంతో సిబ్బందిని సంప్రదించగా, గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెందినట్లు గుర్తించారు. గతంలో చిట్టీల వ్యాపారం, అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించిన కార్తీక్ ఆర్థికనష్టాలు, అప్పుల కారణంగా ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు. కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కోరుట్లరూరల్: మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన అల్లెపు రమేశ్ (32) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్యాంరాజ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం రమేశ్ కొంతకాలం దుబాయ్ వెళ్లాడు. నెలరోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. అప్పటినుంచి భార్యతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం మద్యం సేవించి వచ్చిన రమేశ్ గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రమేశ్‌కు ఇద్దరు పిల్లలున్నారు. తండ్రి అల్లెపు గంగారాజం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


