కరీంనగర్‌టౌన్: జీవో నంబరు 97 రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని హె చ్చరించారు. కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ మోడల్ గురుకుల పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో జీవో నంబర్ 97కు వ్యతిరేకంగా విద్యార్థినులు చేపట్టిన నిరసనకు ఎమ్మెల్యే కమలాకర్ మద్దతు తెలిపారు. ఈ జీవోతో పాలిటెక్నిక్ విద్యార్థులకు ‘ఈ–సెట్’ రాసే అవకాశం పోతుందన్నారు. ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశం పొందలేరన్నారు. ప్రభుత్వం పీవీవీ మోడల్ పేరుతో పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసి, ప్రైవేటీకరించేందుకు కుట్ర చేస్తోందన్నారు. ప్రభుత్వం తక్షణమే జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్‌గౌడ్, శాతవాహన యూనివర్సిటీ బీఆర్‌ఎస్వీ ఇన్‌చార్జి చుక్క శ్రీనివాస్, గంగాధర చందు, మొగిలోజు వెంకట్ పాల్గొన్నారు.
సేవోత్తమ శిక్షణకు పంచాయతీ కార్యదర్శుల ఎంపిక
కరీంనగర్‌రూరల్: సేవోత్తమ్ మోడల్ ద్వారా పౌర వ్యవస్థ పటిష్టానికి ప్రభుత్వం సోమవా రం నుంచి రెండు రోజుల పాటు పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శిక్షణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆరుగురు పంచాయతీ కార్యదర్శులను ఎంపిక చేశారు. జగిత్యాల జిల్లా నుంచి మెట్‌పల్లి మండలం మెట్లచిట్టాపూర్ పంచాయతీకార్యదర్శి ఎస్.రమేశ్, బుగ్గారం మండలం వెల్గొండ కార్యదర్శి ఎస్.సతీష్, మేడిపల్లి మండలం వల్లంపల్లి కార్యదర్శి వి.ప్రవీణ్, కరీంనగర్ జిల్లా నుంచి మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి పంచాయతీకార్యదర్శి కె.ఆనంద్, రామడుగు మండలం వెదిర కార్యదర్శి ఎం.మల్లిఖార్జున్, గంగాధర మండలం నర్సింహులపల్లె కార్యదర్శి కె.మహేశ్‌లను ఎంపిక చేశారు. ఆయా కార్యదర్శులను శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యేలా జిల్లాల పంచాయతీ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని పీఆర్‌ఆర్‌డీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నం
గంగాధర: గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రజాకార్యాలయానికి పాదయాత్ర చేపట్టిన నారాయణపూర్ ప్రజలను పోలీసులు అడ్డుకున్నారు. తమ ఊరిని ముంపు గ్రామంగా ప్రకటించాలని, గ్రామస్తులపై పెట్టిన అక్రమకేసులు ఎత్తివేయాలని, తమ సమస్యలను ఎమ్మెల్యేకు చెప్పుకుందామని వస్తున్న గ్రామస్తులను ఎస్సై వంశీకృష్ణ తన సిబ్బందితో కలిసి గ్రామ పంచాయితీ వద్ద అడ్డుకున్నాడు. సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించి, ఎమ్మెల్యే ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలుపుకోవాలని కోరారు.
ప్రజా చైతన్యానికి కళారూపాలు ఆయుధాలు
కరీంనగర్‌టౌన్: కళ అనేది సామాజిక చైతన్యం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉపయోగపడాలని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని బద్ధం ఎల్లారెడ్డి భవన్‌లో ఆదివారం ప్రారంభమైన తెలంగాణ ప్రజానాట్య మండలి రెండు రోజుల కళాకా రుల శిక్షణా శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొ ని మాట్లాడారు. కళాకారులు నిరంతరం కార్మి క, కర్షక, ప్రజా సమస్యలపై అధ్యయనం చేస్తూ, సమాజంలోని బాధలను ప్రపంచానికి చాటిచెప్పేలా పాటలు, వీధి నాటకాలు రూపొందించాలని కోరారు. సెప్టెంబర్ 6 నుండి 8 వరకు కరీంనగర్‌లో జరగనున్న ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభలను కళారూపాల ప్రదర్శన ద్వారా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు పంజాల శ్రీనివాస్, తాండ్ర సదానందం, కురుమిద్ద శ్రీనివాస్, పల్లె నర్సింహ పాల్గొన్నారు.


