పూలతోటలో రంగుల పండుగ.. ఎగిరే రెక్కల ముంగిట మెరుపుల దండగ.. ప్రకృతిలో అత్యంత అందమైన, ఆకర్షణీయమైన కీటకాలల్లో సీతాకోక చిలుక ఒకటి. వర్షాకాలంలో గుడ్డు నుంచి వెలువడిన గొంగళి పురుగు ఆకులను తింటూ.. తన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకుని కొన్ని రోజుల తరువాత రంగురంగుల రెక్కలతో ఆందమైన సీతాకోక చిలుకలా బయటకు వస్తుంది. నలుపు, ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగుల సీతాకోక చిలుకలు నగరంలోని పూలతోటలలో జాలువారుతూ కనిపించాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్


