నాట్య మయూరాలు | - | Sakshi
Sakshi News home page

నాట్య మయూరాలు

Aug 16 2026 12:33 AM | Updated on Aug 16 2026 12:33 AM

నాట్య మయూరాలు

చిన్న వయసులోనే నాట్యకళపై ఆసక్తి పెంచుకుని కూచిపూడి, జానపద నృత్యాలతో రాష్ట్రస్థాయి వేదికలపై సత్తాచాటారు హుజూరాబాద్‌కు చెందిన చిన్నారులు. పట్టణంలోని కాకతీయకాలనీకి చెందిన యల్చల మహేందర్‌రెడ్డి–వినోద దంపతులకు ఇద్దరు కుమార్తెలు నిర్విరెడ్డి, దేవ్నారెడ్డి. చిన్నప్పటి నుంచే కూచిపూడి, జానపద నృత్యాల మీద ఆసక్తిని పెంచారు. పెద్దకూతురు నిర్విరెడ్డి ఇటీవల రాష్ట్రస్థాయి కళా ఉత్సవంలో జానపద నృత్యం జూనియర్‌ విభాగంలో ద్వితీయ బహుమతి కై వసం చేసుకుంది. అలాగే హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్‌, శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి ఆలయం విజయవాడ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 9 వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి కళా ఉత్సవాల్లో నిర్విరెడ్డి నాట్య ప్రతిభతో ఆకట్టుకున్నట్లు నాట్యగురువు కొంతం వెంకటేశ్వర్లు తెలిపారు.

చిన్న వయసులోనే ఎన్నో ఘనతలు

నిర్విరెడ్డి ఇప్పటికే కూచిపూడి నృత్యంలోనూ పలు అవార్డులు సాధించింది. రాజమండ్రికి చెందిన శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం నిర్వహించిన అంతర్జాతీయస్థాయి పోటీల్లో సబ్‌జూనియర్‌ విభాగంలో ప్రథమ బహుమతి, కరీంనగర్‌ రెయిన్‌ స్టార్‌ డాన్స్‌ అకాడమీ నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ద్వితీయ బహుమతి, వరంగల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కల్చరల్‌ కాంపిటీషన్‌లో ప్రథమ బహుమతి సాధించింది.

తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, గుంటూరులోని సనాతన నృత్య కళా విభాగం, తెలంగాణ సంగీత నాటక అకాడమీ, హైదరాబాద్‌, వీవీఐటీ బాలోత్సవ్‌ వంటి వేదికల్లో ప్రదర్శనలు ఇచ్చి అవార్డులు, నగదు ప్రోత్సాహకాలు అందుకుంది.

రెండేళ్లలోనే అద్భుత ప్రస్థానం

హుజూరాబాద్‌లో ఎన్‌సీఎన్‌ కళాక్షేత్రం ప్రారంభమైనప్పటి నుంచి నిర్విరెడ్డి కూచిపూడి, జానపద నృత్యాలను గురువు కొంతం వెంకటేశ్వర్లు వద్ద అభ్యసిస్తోంది. ఈమె చెల్లెలు దేవ్నారెడ్డి కూడా అక్కతో కలిసి కూచిపూడి నృత్యంలో పలు ప్రదర్శనలు ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement