నాదం.. సాధనం | - | Sakshi
Sakshi News home page

నాదం.. సాధనం

Aug 16 2026 12:33 AM | Updated on Aug 16 2026 12:33 AM

విద్యానగర్‌(కరీంనగర్‌)/హుజూరాబాద్‌: పిట్ట కొంచెం.. కూత ఘనం.. అన్నట్లుగా పలువురు విద్యార్థులు ఆయా కళల్లో సత్తాచాటుతునాన్నారు. కరీంనగర్‌ ద్వారకనగర్‌కు చెందిన భీమనాతిని ప్రణవి కూ చిపూడి, కరాటే, యోగా, చదువులో రాణిస్తూ ప్రశంసలు అందుకుంటుంది. హుజూరాబాద్‌కు చెందిన నిర్విరెడ్డి, దేవ్నారెడ్డి నాట్యంలో పలు ప్రదర్శనలు ఇస్తూ అందరిచే శభాష్‌ అనిపించుకుంటున్నారు.

నాలుగేళ్లుగా నృత్యం

ప్రస్తుతం ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న ప్రణవి 6వ తరతగతి నుంచి నాలుగేళ్లుగా కూచిపూడి నృత్యం నేర్చుకుని వివిధ వేదికల మీద ప్రదర్శించి అందరితో శభాష్‌ అనిపించుకుంటుంది. కరీంనగర్‌ మార్కెట్‌ రోడ్డులోగల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో తన నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. శ్రీయజ్ఞవరాహస్వామి వార్షికోత్సవాలతోపాటు ఇతర వేదికలపై ప్రదర్శనలిచ్చి అనేక బహుమతులు అందుకుంది. కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌ సాధించి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని 30 పైగా మెడల్స్‌ సాధించింది. తండ్రి రంజిత్‌కుమరా సివిల్‌ ఇంజినీర్‌ కాగా తల్లి రమాదేవి ప్రైవేట్‌ టీచర్‌. చిన్నప్పటి నుంచి డాన్స్‌, కరాటేపై మక్కువ చూపిస్తుండడంతో తల్లిదండ్రులు ఆమెకు శిక్షణ ఇప్పించారు. వివిధ కళా సంస్థల ఆధ్వర్యంలో 50పైగా కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చిన ప్రణవి నృత్యకారిణి, కరాటే చాంపియన్‌, యోగా మాస్టార్‌గా రాణించాలని ఆశిద్దాం.

కూచిపూడి, కరాటే ప్రదర్శనలో ప్రణవి

నృత్యం, కరాటే, యోగా, చదువులో రాణిస్తున్న చిన్నారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement