కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని జిల్లా ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో షేకబికాలనీ, రేకుర్తి, కొత్తపల్లి మండల పరిధిలో శనివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రేకుర్తి ప్రాంతానికి చెందిన మహమ్మద్ షాబిక్, మహమ్మద్ షారుక్‌ను అదుపులోకి తీసుకుని వారి నుంచి 190 గ్రాముల గంజాయి, ఒక బైక్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును కరీంనగర్ రూరల్ ఎకై ్సజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు వెల్లడించారు. దాడుల్లో ట్రైనీ ఎస్సైలు అరుణ్‌కుమార్, మహేశ్, శ్రీనివాస్, సిబ్బంది రాజు, సతీశ్, రాజేందర్, అక్షర పాల్గొన్నారు.


