కరీంనగర్ కల్చరల్: ‘చదువుల చిలకమ్మ’ నవల నేటి విద్యా వ్యవస్థకు ఎంతో అవసరమ ని, ఒక తరాన్ని మార్చగలిగే అక్షర రూపమని ప్రముఖ కవి సాదనాల వెంకటస్వామి నాయు డు అన్నారు. భవానీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన సోమవారం కరీంనగర్ ఫిల్మ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కోట లక్ష్మణ్ రచించిన ‘చదువుల చిలకమ్మ’ నవలను ఆవిష్కరించారు. సాహితీ గౌతమి అధ్యక్షుడు నంది శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పుస్తకం పాఠశాల విద్యలో మార్పులకు దోహదపడుతుందన్నారు. ఉదయ సాహితీ అధ్యక్షు డు ఎర్రం రాజారెడ్డి ఒత్తిడి లేని విద్య, స్వేచ్ఛాయుత వాతావరణంలో అభ్యసన ప్రాధాన్యాన్ని వివరించారు. స్తంభంకాడి గంగాధర్, నడిమెట్ల రామయ్య, అన్నమరాజు శ్రీధర్‌రావు, కాసం రాజమౌళి, వెల్ముల జయపాల్‌రెడ్డి, సీహెచ్.రమేశ్, సంగోజు శ్రీనివాస్, కనపర్తి రాజశేఖర్, రాము ఇటిక్యాల్, కోడూరి రవి, కసిరెడ్డి జలంధర్‌రెడ్డి, జనగాని యుగంధర్, బి.శ్రీనివాస్, ఎం.సాంబమూర్తి, మాసం సీమ, డి.శంకరయ్య, ఖాలీద్ పాల్గొన్నారు.
నారాయణపూర్ ప్రజలకు న్యాయం చేయాలి
గంగాధర: నారాయణపూర్ రిజర్వాయర్‌తో నష్టపోతున్న గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మైత్రీ గ్రూప్స్ చైర్మన్ కొత్త జయపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించాలని, 13మంది గ్రామస్తులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని గ్రామస్తులు చేపట్టిన రిలే దీక్ష సోమవారం రెండోరోజు కొనసాగింది. రవిశంకర్‌తో పాటు పలువురు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఎన్నికల ముందు తాను గెలిచిన తరువాత నెలరోజుల్లో నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటిస్తానని చెప్పిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారన్నా రు. కొన్ని ఇళ్లను ముంపు కింద తీసుకొని మిగితా వారికి అన్యాయం చేయొద్దన్నారు.
రైల్వే గేటు వద్ద ఇరుక్కుపోయిన లారీ
గంగాధర: కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారిలోని గంగాధర మండలం మంగపేట రైల్వేస్టేషన్ సమీపంలోని టి 29 గేటు వద్ద సోమవారం ఉదయం భారీ లారీ ఇరుక్కుపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ గేటు వద్ద తరచూ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని వాహనదారులు పేర్కొంటున్నారు. గేటు మొరాయించడం, భారీ వాహనాలు ఇరుక్కుపోవడం వంటి సమస్యలతో ట్రాఫిక్‌జామై అంబులెన్సు వచ్చినప్పు డు పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని, బ్రిడ్జి నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు.


