● జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల పునర్‌వ్యవస్థీకరణపై కలెక్టర్‌ సమీక్ష | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల పునర్‌వ్యవస్థీకరణపై కలెక్టర్‌ సమీక్ష

Aug 10 2026 11:54 PM | Updated on Aug 10 2026 11:54 PM

● జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల పునర్‌వ్యవస్థీకరణపై కలెక్టర్‌ సమీక్ష

కరీంనగర్‌ అర్బన్‌: ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణలో భాగంగా పోలింగ్‌ స్టేషన్ల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీ ల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ చిత్రామిశ్రా కలెక్టరేట్లో సోమవారం సమీక్షించారు. చొప్పదండి, కరీంనగర్‌, మానకొండూర్‌ హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న కొన్ని పోలింగ్‌ స్టేషన్ల లొకేషన్లలో అవసరమైన మార్పులపై చర్చించారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో 1200 కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్నట్లయితే మరో పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో చేరుస్తామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల పరిశీలన అనంతరం తదుపరి నిర్ణయాలు ఉంటాయన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎస్‌ఐఆర్‌ పకడ్బందీగా చేపట్టామని తెలిపారు. అడిషనల్‌ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, ఆర్డీవో జల కుమారి, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

రానున్న రోజుల్లో ఎల్‌ నినో ప్రభావం

ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని కలెక్టర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. జిల్లాలో సుమారు 3.44లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉందని, ఇప్పటివరకు 2.86లక్షల ఎకరాల్లో పంటలు వేశారని, 2.21 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారని పేర్కొన్నారు. మిగతా సాగు భూముల్లో పప్పు దినుసులు, నూనె గింజలు, తృణ ధాన్యాలు వంటివి సాగు చేయాలన్నారు.

ఏం చేద్దాం.. ఎలా చేద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement