జ్యోతినగర్: రోడ్డు ప్రమాదానికి కారణం కావడంతోపాటు ఒకరు మృతి చెందిన ఘటనకు సంబంధించిన వ్యక్తులను గుర్తుపట్టాలని పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీసులు ఒక ఫొటో విడుదల చేశారు. ఈనెల 2వ తేదీన ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రాంతానికి చెందిన కోండ్ర లింగమూర్తి(42) మృతి చెందిన విషయం విదితమే. ఈ ప్రమాదనికి కారణమైన వ్యక్తులు టీవీఎస్ రైడర్ రెడ్ కలర్ ద్విచక్ర వాహనంపై పరారయ్యారని, వీరిని గుర్తిసే తగిన బహుమతి ఉంటుందని, సమాచారం అందించిన వారివివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు ప్రకటించారు. గుర్తించినవారు ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్ కిరణ్ : 871265 6526, 87125 38620 నంబరులో సంప్రదించి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
కనిపిస్తే సమాచారం అందించండి
ఫొటో విడుదల చేసిన పోలీసులు


