వ్యవసాయ మార్కెట్‌ వ్యాపారి మృతి | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ మార్కెట్‌ వ్యాపారి మృతి

Aug 10 2026 11:42 PM | Updated on Aug 10 2026 11:42 PM

జగిత్యాలఅగ్రికల్చర్‌: జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో అడ్తి, ఖరీదు దారుగా వ్యవహరిస్తున్న వ్యాపారి పాపునుక భిక్షపతి (70) సోమవారం అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయన మృతిపై మార్కెట్‌ చైర్మన్‌ గడ్డం నారాయణరెడ్డి, అడ్తి, ఖరీదుదారుల సంఘం అధ్యక్షుడు చిక్కుల భూమయ్య సంతాపం తెలిపారు. ఈ మేరకు మంగళవారం మార్కెట్‌యార్డులో క్రయవిక్రయాలు నిలిపివేసి, సెలవుగా ప్రకటిస్తున్నట్లు మార్కెట్‌ చైర్మన్‌ పేర్కొన్నారు.

యువకుడి ఆత్మహత్య

కరీంనగర్‌రూరల్‌: తీగలగుట్టపల్లిలోని చంద్రపురికాలనీకి చెందిన గొర్రె మధు(35) కడుపునొప్పి భరించలేక సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కరీంనగర్‌ రూరల్‌ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. మధు కొంతకాలంగా మద్యానికి బానిస కాగా కడుపునొప్పితో బాధపడుతూ వైద్యం చేయించుకుంటున్నాడు. సోదరుడు మనోహర్‌తో కలిసి కూలీపనులకు వెళ్లిన మధు కడుపునొప్పి ఉందంటూ ఇంటికి తిరిగొచ్చాడు. ఇంట్లో సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధు తల్లిదండ్రులు గతంలోనే మృతిచెందగా సోదరుడితో కలిసి ఉంటున్నాడని, మృతుడికి ఇంకా వివాహం కాలేదని తెలిపారు. మనోహర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

అరటిపండ్ల వ్యాపారి..

కరీంనగర్‌ క్రైం: దీర్ఘకాలంగా నరాల వ్యాధితో బాధపడుతూ, మనస్తాపానికి గురైన అరటిపండ్ల వ్యాపారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్‌ టూ టౌన్‌ పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన గాజ యాదయ్య(57) అరటిపండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడేళ్లుగా నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. లపు ఆస్పత్రులు తిరిగినా వ్యాధి నయం కాలేదు. జీవితంపై విరక్తి చెంది సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

మహిళ అదృశ్యం

గంగాధర: మండలంలోని గర్శకుర్తి గ్రామానికి చెందిన శ్రీపతి లక్ష్మి (65) అదృశ్యమైంది. కుటుంసభ్యుల ఫిర్యాదు మేరకు గంగాధర పోలీసులు కేసు నమోదు చేసారు. ఎస్సై వంశీకృష్ణ వివరాల ప్రకారం.. లక్ష్మి కేన్సర్‌తో బాధపడుతోంది. ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది. తెల్లవారినా రాలేదు. కుటుంబసభ్యులు పలుచోట్ల వెతకగా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement