రామగుండం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన రైతు కొండ రాజయ్యగౌడ్(65) సోమవారం తన పొలం పనులు చేస్తుండగానే హఠాత్తుగా కుప్పకూలాడు. అక్కడే పనిచేస్తున్న రైతులు, కూలీలు వెంటనే వెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది కనిపించాడు. మృతుడికి భార్య మల్లమ్మ, కుమారుడు వెంకటస్వామి, నలుగురు కూతుళ్లు ఉన్నారు. అందరూ వివాహితులే.
వీర్నపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు, ముదిరాజ్ సంఘం నా యకుడు పిట్ల ముత్యం(56) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. తన పొలంలో ఆదివారం పొద్దా ంత పొలం పనులు చేసి వచ్చాడు. సోమవారం ఉదయం సైతం వరినాట్లు వేసేందుకు సిద్ధం చేసుకుంటుండగా హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించేలోపే ప్రా ణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య దేవలక్ష్మి, ఇద్దరు కుమారులు ప్రశాంత్, ప్రేమ్‌చంద్ ఉన్నారు.
వేములవాడ: పట్టణంలోని ఉప్పుగడ్డకు చెందిన రిటైర్డ్ ఏఎస్సై సగ్గు భిక్షపతి సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు బంధువులు తెలిపారు. ఐదు నెలల క్రితం ఏఎస్సైగా ఉద్యోగ విరమణ పొందారు. సోమవారం చాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే భిక్షపతి మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.


