కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలో శనివారం కొడుకును హత్య చేసేందుకు ప్రయత్నించిన తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు చందుర్తి సీఐ రవీందర్ తెలిపారు. కోనరావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మల్కపేటలో గుడిపేట రాఘవులు తన కొడుకు రాజేందర్‌పై గొడ్డలితో దాడి చేసి హత్యకు ప్రయత్నించాడు. రాజేందర్ ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు రాఘవులును అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఎస్సై ప్రశాంత్‌రెడ్డి, కానిస్టేబుళ్లు జగన్, విశాల్‌రాజు, మనోజ్ తదితరులు ఉన్నారు.


