ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆత్మహత్య

Aug 10 2026 1:16 AM | Updated on Aug 10 2026 1:16 AM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్‌ మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ బందెల రమేశ్‌ ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రమేశ్‌ నర్సింగాపూర్‌లోని గంగారెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. యజమాని నుంచి రమేశ్‌కు రూ.500 రావాల్సి ఉంది. ఈ క్రమంలో రమేశ్‌ తమను బూతులు తిడుతూ మెసేజ్‌లు పోస్ట్‌ చేస్తున్నాడంటూ యజమానితోపాటు మరోవ్యక్తి వచ్చి రమేశ్‌పై దాడికి దిగారు. రమేశ్‌కు చికిత్స అందించిన కుటుంబసభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. ఇంతలో ఏమైందో తెలియదుగానీ.. రమేశ్‌ ఇంట్లోకి వెళ్లి ఉరేసుకున్నాడు. రమేశ్‌ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ట్రాక్టర్‌ యజమాని గంగారెడ్డితోపాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

డివైడర్‌ను ఢీకొని వ్యక్తి దుర్మరణం

జగిత్యాలక్రైం: జగిత్యాలలోని బైపాస్‌రోడ్డులో డివైడర్‌ను ఢీకొని ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఒకరు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. జిల్లాకేంద్రంలోని అశోక్‌నగర్‌కు చెందిన కాశిపాక గంగాధర్‌ స్థానిక ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. పని నిమిత్తం గంగాధర్‌ ఆయన తాత దీకొండ పోశయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై కొత్త బస్టాండ్‌కు వెళ్లి.. బైపాస్‌ రోడ్డు మీదుగా వస్తున్నారు. ద్విచక్రవాహ నం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో గంగాధర్‌, పోశయ్య తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇద్దరినీ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గంగాధర్‌ మృతిచెందాడు. పోచయ్యకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గంగాధర్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రామడుగు(చొప్పదండి): రామడుగు మండలం దత్తోజీపల్లి శివారులో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో చొప్పదండి మండలం గుమ్లాపూర్‌ గ్రామానికి చెందిన ఆకుల లక్ష్మయ్య(70) మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆకుల లక్ష్మయ్య ఆదివారం సాయంత్రం రామడుగు నుంచి గుమ్లాపూర్‌కు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. దత్తోజీపల్లి శివారులో వాహనం అదుపు తప్పి కిందపడ్డాడు. తల బండరాయికి తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

ముంపు గ్రామంగా ప్రకటించాలి

గంగాధర: గంగాధర మండలం నారాయణపూర్‌ను రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా ముంపు గ్రామంగా ప్రకటించాలని, గ్రామంలోని 13మందిపై అక్రమంగా నమోదు చేసిన ఎస్సీ,ఎస్టీ కేసులు ఎత్తి వేయాలని ఆదివారం మహిళలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ.. రిజర్వాయర్‌ పనులు పూర్తి కాక ముందే చెరువు నిండితే ఊరుమొత్తం జాలు వారుతుందన్నారు. ఇప్పటికే ఇళ్లలోకి నీటితో పా టు, పాములు, తేళ్లు వస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో రెండుసార్లు కట్ట తెగి ఊళ్లోకి నీరు చేరిందన్నారు. సమస్య పరిష్కారానికి ఊరు మొత్తాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని ఏళ్లకాలంగా విన్నవిస్తున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. మొదట్లో 11ఇళ్లు, ఇప్పు డు దాదాపు ముప్‌పై ఇళ్లను ముంపుకింద తీసుకుంటున్నట్లు తెలిసిందన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement