ఉచితంగా మద్యం ఇవ్వలేదని దౌర్జన్యం | - | Sakshi
Sakshi News home page

ఉచితంగా మద్యం ఇవ్వలేదని దౌర్జన్యం

Aug 10 2026 1:16 AM | Updated on Aug 10 2026 1:16 AM

పెద్దపల్లి: తమకు ఉచితంగా మద్యం ఇవ్వలేదనే ఆగ్రహంతో ముగ్గురు వైన్స్‌షాప్‌లోకి ప్రవేశించి దౌర్జన్యం చేశారు. ఆస్తులను ధ్వంసం చేసి, నిర్వాహకులను హత్య చేస్తామని బెదిరించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా హన్మంతునిపేటలో చోటుచేసుకుంది. వైన్స్‌షాప్‌ నిర్వాహకుడు విద్యాసాగర్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఈనెల 8న రాత్రి సుమారు 7.30 నుంచి 8 గంటల మధ్య సురభి కిరణ్‌రావు, శ్రీనివాస్‌రావు, పోలసాని సుధాకర్‌రావు హన్మంతునిపేటలోని లక్ష్మీగణపతి వైన్స్‌లోకి బలవంతంగా ప్రవేశించారు. తమకు ఉచితంగా మద్యం ఇవ్వాలని డిమాండ్‌ చేయగా నిర్వాహకులు నిరాకరించారు. దీంతో విద్యాసాగర్‌తోపాటు సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషిస్తూ హత్య చేస్తామని బెదిరించారు. అంతటితో ఆగకుండా గ్రిల్‌ ధ్వంసం చేశారు. మద్యం బాటిళ్లు పగులగొట్టట్టారు. సీలింగ్‌ ఫ్యాన్‌ రెక్కలు విరగ్గొట్టారు. దీంతో తనకు పెద్దఎత్తున ఆస్తినష్టం వాటిల్లిందని విద్యాసాగర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. కిరణ్‌రావు గతంలోనూ ఇదేవిధంగా ఇబ్బందులకు గురిచేసినా.. సమస్యను పెద్దది చేయకుండా వదిలేశామని, ఈసారి ఆస్తినష్టం వాటిల్లడంతోపాటు ప్రాణహాని కలిగించేలా బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలనిపోలీసులను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement