చేనేత కళాకారుల నైపుణ్యం అమోఘం | - | Sakshi
Sakshi News home page

చేనేత కళాకారుల నైపుణ్యం అమోఘం

Aug 8 2026 1:29 AM | Updated on Aug 8 2026 1:29 AM

చేనేత కళాకారుల నైపుణ్యం అమోఘం

కరీంనగర్‌: చేనేత కార్మికుల కళానైపుణ్యం అమోఘమని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం 39వ డివిజన్‌లోని చేనేత సహకార సంఘం కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకల్లో మాట్లాడారు. దేశీయ చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, మా ర్కెటింగ్‌ అవకాశాలు కల్పించడంతోపాటు చేనేత కార్మికుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందన్నారు. చేనేత మగ్గంపై స్వయంగా నేస్తూ మగ్గం పనితీరును పరిశీలించారు. చేనేత సహకార సంఘం అధ్యక్షు డు, డైరెక్టర్లు, సభ్యులను సన్మానించారు. కార్పొరేట ర్లు వాసాల రమేశ్‌, వేముల కవిత చంద్రశేఖర్‌, లక్ష్మి రమేశ్‌, చొప్పరి జయశ్రీ, మాసం గణేశ్‌, దేవసాని సరస్వతి సత్యనారాయణ, సత్యం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement