నీలినీలి ఆకాశాన్ని వాన మబ్బులు కమ్ముకున్నాయి. కాసేపు వరుణుడు జల్లులు కురిపించగా గెరువివ్వగానే ప్రకృతి అందాలు కనువిందు చేశాయి. మేఘాల చాటున దాగిన సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తుండగా.. ఆకాశం ఎరుపెక్కి సప్తవర్ణంలోకి మారింది. ఓ వైపు కొండలు.. మరోవైపు విశాలమైన రహదారి.. మధ్యలో వాహనాల రాకపోకలతో మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి ప్రాంతం శుక్రవారం సాయంత్రం సుందరంగా కనిపించింది. అప్పుడే వెలిగిన విద్యుత్ దీపాలు మిరుమిట్లు గొలుపుతూ సాయంకాలపు అందాలతో కనువిందు చేశాయి. – మానకొండూర్


