కరీంనగర్‌సిటీ: భారత ఆహర భద్రతకు దిక్సూచిగా స్వామినాథన్ నిలిచారని ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ కొనియాడారు. హరిత విప్లవ పితామహుడు, భారతరత్న ఎం. ఎస్.స్వామినాథన్ 101వ జయంతిని వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ రామకృష్ణ మాట్లాడుతూ ఎం.ఎస్.స్వామినాథన్ భారత వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు దేశ ఆహార భద్రతకు బలమైన పు నాది వేశాయన్నారు. విద్యార్థులు ఆయన శా సీ్త్రయ దృక్పథాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నా రు. కడారు సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ స్వా మినాథన్ హరిత విప్లవానికి కీలకమైన నాయకత్వం వహించారన్నారు. బోటనీ ప్రొఫెసర్ తిరుకోవెల శ్రీనివాస్ మాట్లాడుతూ స్వామినా థన్ పరిశోధనలు వ్యవసాయ రంగానికి కొత్త దిశను చూపించాయన్నారు. అధ్యాపకులు రౌతు రాధాకృష్ణ, ఎండీ.థేర్ హుస్సేన్, పడాల తిరుపతి, కళాజ్యోతి, అందె బుంగ తిరుపతి, తాజొద్దీన్, స్వరూపారాణి పాల్గొన్నారు.
కరీంనగర్‌కల్చరల్: విద్యార్థులు, యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు విద్యా ప్రాధాన్యతను వివరించేందుకు జ్ఞాన సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. స్వేరోస్ ఆధ్వర్యంలో ఈనెల 30న మధ్యాహ్నం 12 గంటలకు గంగాధరలో నిర్వహించే జ్ఞాన సమ్మేళన పోస్టర్‌ను శుక్రవారం నగరంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ ప్రతినిధులు, ఫిట్ ఇండియా ఫౌండేషన్ నాయకుడు కొంకటి శేఖర్, దుస్సా కుమార్‌స్వామి, మేకల రవీందర్, ఎర్ర రాజు, జన్ను స్వరూప, మారుపాక రాజు, దొబ్బెల ప్రేమ్, జెట్టిపల్లి అనిల్, మొలుమ్మూరి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
జాబ్‌మేళాకు స్పందన
కరీంనగర్‌సిటీ: కరీంనగర్‌లోని తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ (టీఎస్‌కేసీ) ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం మెగా జాబ్‌మేళా ఘనంగా నిర్వహించారు. క్యూస్‌కార్ప్, ఫాక్స్‌కానన్, రిలయన్స్ నిప్పాన్ ఇన్సూరెన్స్, పీఎస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సహస్ర సాప్ట్‌వేర్ సొల్యూషన్స్, సచీనీడర్ ఎలక్ట్రానిక్స్, ఫొర్చూన్ మెడికేర్ హస్సిటల్, దృవంత్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పాల్గొని తయారీ, సాఫ్ట్‌వేర్, లాజిస్టిక్స్, అకౌంట్స్, ఫ్రంట్ ఆఫీస్, రిలేషన్‌షిప్ మేనేజర్, టెలీకాలర్స్, టీమ్ లీడర్ తదితర విభాగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించాయి. 300 మందికి పైగా నిరుద్యోగ యువత హాజరుకాగా 120మందిని షార్ట్‌లిస్ట్ చేసి ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటెంట్ లెటర్స్ అందించారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఆయా సంస్థల నిబంధనల ప్రకారం తదుపరి దశలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు టీఎస్‌కేసీ బృందం సభ్యులు డి.శ్రీనివాస్, జి.రాజశేఖర్ తెలిపారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం
కొత్తపల్లి: కొత్తపల్లి, రేకుర్తి 33/11 కేవీ సబ్‌స్టేషన్లలో నిర్వహణ పనుల నేపథ్యంలో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొత్తపల్లి, వెలిచాల, దేశరాజ్‌పల్లి, వెదిర, రాణిపూర్, రేకుర్తి, సీతారాంపూర్, కంటి హాస్పిటల్, బ్లైండ్ స్కూల్ ప్రాంతం, సాలేహ్‌నగర్, గౌడ్స్ కాలనీ, కొత్తవాడ, పాతవాడతో పాటు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మొగ్ధుంపూర్ సబ్‌స్టేషన్ పరిధిలోని మొగ్దుంపూర్, మండులపల్లి, చెగుర్తి, ఇరుకుల్ల, చర్లభూత్కూర్, చామన్‌పల్లి, దుబ్బపల్లి, తహెర్‌కొండాపూర్, జూబ్లీ నగర్, బహదూర్‌ఖాన్‌పేట్, ఫకీర్‌పేట్ గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు.


