10 నుంచి జిల్లా సెన్సెస్‌ హ్యాండ్‌బుక్‌ డేటా | - | Sakshi
Sakshi News home page

10 నుంచి జిల్లా సెన్సెస్‌ హ్యాండ్‌బుక్‌ డేటా

Aug 8 2026 1:29 AM | Updated on Aug 8 2026 1:29 AM

10 నుంచి జిల్లా సెన్సెస్‌ హ్యాండ్‌బుక్‌ డేటా

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ఈ నెల 10వ తేదీ నుంచి జిల్లా సెన్సెస్‌ హ్యాండ్‌ బుక్‌ రూపొందించేందుకు డేటా సేకరించాలని రాష్ట్ర సెన్సెస్‌ డైరెక్టర్‌ భారతి హోళికేరి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, డిప్యూటీ కమిషనర్‌ ఖాదర్‌ మొహియొద్దీన్‌, డీసీపీ బషీర్‌ కరీంనగర్‌ నుంచి పాల్గొన్నారు. జనాభా లెక్కల్లో భాగంగా చేపట్టనున్న ఈ సెన్సెస్‌ హ్యాండ్‌ బుక్‌ జిల్లా సమగ్ర సమాచారం ఉండాలన్నారు. ఈ నెల 10 నుంచి ప్రారంభించి సెప్టెంబర్‌ 8వ తేదీతో ఈ ప్రక్రియ ముగుస్తుందన్నారు. నగరంలోని ఆసుపత్రులు, వైద్య సదుపాయాలు, పాఠశాలలు, కళాశాలలు , వినోద, సాంస్కతిక సౌకర్యాలు, తాగునీటి సరఫరా, నీటి లభ్యత, రవాణా, విద్యుత్‌, బ్యాంకింగ్‌, ఇతర మౌలిక సదుపాయాలు, నగరంలోని డివిజన్‌లు గృహాల సంఖ్య, మొత్తం జనాభా, పురుషులు,సీ్త్రల నిష్పత్తి,అక్షరాస్యత శాతం, ఎస్సీ,ఎస్టీ జనాభా, రైతులు, కూలిలు, భౌగోళిక, రైల్వే స్టేషన్‌, బస్‌ టెర్మినల్‌ సదుపాయాలు, డ్రైనేజీ, పారిశుధ్య వ్యవస్థ తదితర గణంకాల వివరాలను సేకరించాలన్నారు. సేకరించిన డేటా ప్రకారం వెబ్‌ పోర్టల్‌ ద్వారా మ్యాపింగ్‌ చేయాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement