ఉరివేసుకుని ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరివేసుకుని ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య

Aug 8 2026 1:29 AM | Updated on Aug 8 2026 1:29 AM

గోదావరిఖని: మంచిర్యాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆజ్మీర జైతులాల్‌(52) శుక్రవారం గోదావరిఖని శారదానగర్‌లోని చిన్నకూతురు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మమత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్‌టౌన్‌ ఎస్‌ఐ అనూష కథనం ప్రకారం.. కొంతకాలం క్రితం అనారోగ్యానికి గురైన జైతులాల్‌కు.. ఆరునెలల క్రితం ఓపెన్‌హార్ట్‌ సర్జరీ చేయించుకున్నాడు. మంచిర్యాల జిల్లా తాండూరుకు చెందిన జైతులాల్‌ మంచిర్యాల డిపోలో డ్రైవర్‌గా చేస్తూ కూతురు వద్ద ఉంటున్నాడు. భార్య సొంతూరులో వ్యవసాయం చేయిస్తూ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ వెళ్లేది. ఓపెన్‌హార్ట్‌ సర్జరీ తర్వాత మద్యం, ధూమపానం పూర్తిగా మానేయాలని కుటుంబ సభ్యులు కోరారు. ఒకనెలపాటు బాగానే ఉన్నా.. తర్వాత మళ్లీ మద్యపానం, ధూమపానం మొదలెట్టాడు. దీంతో ఆరోగ్యం క్షీణించింది. ఈక్రమంలో మనస్తాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

అనారోగ్య సమస్యలే కారణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement