మహాముత్తారం: ఓ వైన్స్‌లో బైక్ చోరీచేసిన కేసులో నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీ చచేస్తుండగా.. కరీంనగర్ జిల్లా మొగ్దంపూర్ గ్రామానికి చెందిన భూతం ఆంజనేయులు, సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామానికి చెందిన మహంకాళి కమల్, కరీంనగర్ ఆదర్శనగర్‌లో నివాసం ఉంటుంన్న శివరాత్రి అభిలాష్, కరీంనగర్ మండలం మండులపల్లి గ్రామానికి చెందిన కవ్వంపల్లి అరుణ్ అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని విచారించారు. యామన్‌పల్లి గ్రామంలోని తెలంగాణ వైన్స్‌లో చోరీ, ఒక హీరోస్పెలండర్ మోటార్‌సైకిల్‌ను దొంగిలించినట్లు వారు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి 5 బీరుబాటిళ్లు, 25 రాయల్ స్టాగ్ క్వార్టర్ బాటిళ్లు, రూ.5వేలు నగదుతోపాటు చోరీకి వినియోగించిన స్విఫ్ట్‌కారు, 2 స్మార్ట్‌ఫోన్లు, మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచినట్లు మహాముత్తారం ఎస్‌ఐ రమేశ్ తెలిపారు.


