కండ్లపల్లి మోడల్‌ స్కూల్‌ విద్యార్థిని అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

కండ్లపల్లి మోడల్‌ స్కూల్‌ విద్యార్థిని అదృశ్యం

Aug 7 2026 1:44 AM | Updated on Aug 7 2026 1:44 AM

జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్‌ మండలం కండ్లపల్లి మోడల్‌ స్కూల్‌ నుంచి ఏడో తరగతి విద్యార్థిని బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. మధ్యప్రదేశ్‌ నుంచి వలస వచ్చిన ఓ కుటుంబం జిల్లాకేంద్రంలో కొన్నేళ్లుగా పానీపూరి దుకాణం నిర్వహిస్తున్నారు. వారి కూతురు ఎప్పటిలాగే తోటి విద్యార్థులతో పాఠశాలకు వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో బాత్రూంకు వెళ్లి డ్రెస్‌ చేంజ్‌ చేసుకుని పుస్తకాల బ్యాగ్‌తోపాటు ఓ లేఖను స్కూల్‌లో వదిలి బయటకు వెళ్లిపోయింది. విద్యార్థిని తండ్రి రామ్‌వీర్‌ ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై ఉమాసాగర్‌ కేసు నమోదు చేశారు. పోలీసులు పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టగా.. తల్లిదండ్రులు తనకు ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తున్నారని తన స్నేహితులతో చెప్పుకున్నట్లు బయటపడింది. తాను మధ్యప్రదేశ్‌ వెళ్లిపోతున్నట్లు లేఖలో రాసింది. సదరు బాలిక ఇన్‌స్ట్రాగాం వేదికగా ఓ యువకుడితో చాటింగ్‌ చేసినట్లు గుర్తించిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే సదరు బాలిక మధ్యప్రదేశ్‌లోని రైల్వేస్టేషన్‌లో అక్కడి పోలీసులు గుర్తించినట్లు ఇక్కడి పోలీసులకు సమాచారం అందగా.. విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు.

రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

గాలింపు చేపట్టిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement