వేములవాడఅర్బన్: పోక్సో కేసుల్లో నాణ్యమైన దర్యాప్తుతో నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని రాజన్న జోన్ డీఐజీ సన్‌ప్రీత్‌సింగ్ అధికారులను ఆదేశించారు. వేములవాడ పోలీస్ సబ్‌డివిజన్ కార్యాలయాన్ని గురువారం తనిఖీ చేశారు. భీమేశ్వరస్వామిని ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి గురువారం దర్శించుకున్నారు. కోడెమొక్కు చెల్లించారు. అనంతరం వేములవాడ పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో పలు రికార్డులు పరిశీలించారు. ఇప్పటి వరకు నమోదైన కేసులు, పెండింగ్, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిని సమీక్షించారు. వేములవాడకు వచ్చే భక్తులకు సమగ్ర భద్రత కల్పించాలని సూచించారు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, రవీందర్ తదితరులు ఉన్నారు.
రాజన్న జోన్ డీఐజీ సన్‌ప్రీత్‌సింగ్


