అంతరాయం లేకుండా విద్యుత్‌ లైన్ల నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

అంతరాయం లేకుండా విద్యుత్‌ లైన్ల నిర్వహణ

Aug 5 2026 1:47 AM | Updated on Aug 5 2026 1:47 AM

అంతరాయం లేకుండా విద్యుత్‌ లైన్ల నిర్వహణ సంపూర్ణ సహకారమందిస్తాం విద్యార్థులు లక్ష్యసాధన కోసం కష్టపడి చదవాలి ఐసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన

కొత్తపల్లి(కరీంనగర్‌): విద్యుత్‌ అంతరాయం లేకుండా 11 కేవీ, 33 కెవీ లైన్ల నిర్వహణ పనులు నిర్వహించాలని టీజీఎన్‌పీడీసీఎల్‌ సీఈ (హెచ్‌ఆర్‌డీ), నోడల్‌ అధికారి కంకటి వేణుమాధవ రావు సూచించారు. కరీంనగర్‌లోని సర్కిల్‌ కార్యాలయంలో ఎస్‌ఈ ఆర్‌.రవీందర్‌తో కలిసి మంగళవారం సర్కిల్‌ రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. 11 కె.వీ పోల్‌ సంఖ్య నంబరు వేసి ఆన్‌లైన్‌లోనే జీఐఎస్‌ కోఆర్డినేటర్స్‌తో డిజిటలైజేషన్‌ చేయాలని ఏఈ, ఏడీఈలను ఆదేశించారు. కొత్త కనెక్షన్‌ మీటర్‌ దరఖాస్తు రెండు, మూడు రోజుల్లో పరిష్కరించాలన్నా రు. లైన్‌ పనులు, ట్రాన్స్‌ఫార్మర్‌ చార్జ్‌ అయితే వర్క్‌ ఆర్డర్‌ క్లోజ్‌ చేయాలన్నారు. నాన్‌ ఐఆర్డీఏ మీటర్లను ఐఆర్డీఏగా మార్చాలన్నారు. ప్రజా బాట కార్యక్రమాన్ని మంగళ, గురు, శనివారా ల్లో తమ సెక్షన్‌ పరిధిలో నిర్వహించి క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించా రు. ట్రాన్స్‌ఫార్మర్‌ ఫెయిల్‌ అయితే విద్యుత్‌ సంస్థ వాహనంలోనే రవాణా చేయాలని సూ చించారు. డీఈ కే.ఉపేందర్‌, జంపాల రాజం, లక్ష్మారెడ్డి, ఎం.తిరుపతి, చంద్రమౌళి, ఎస్‌ఏవో రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు. విద్యుత్‌ భవన్‌ సమావేశ మందిరంలో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కరీంనగర్‌ ఆధ్వర్యంలో 40మంది విద్యుత్‌ ఉద్యోగులు రక్తదానం చేశారు.

కరీంనగర్‌ అర్బన్‌: జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం నూతన జిల్లా కార్యవర్గాన్ని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి వాకిడి శ్రీహరి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అభినందించారు. సంఘం జిల్లా చైర్మన్‌ బాసవేని మల్లేశం యాదవ్‌ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కార్యవర్గం మంత్రులను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రులు పాలక వర్గాన్ని సన్మానించారు. అనంతరం పశుగణనశాఖ చైర్మన్‌ చరణ్‌ కౌశిక్‌ యాదవ్‌, రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమైక్య చైర్మన్‌ సరితతిరుపతయ్య, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుబ్బారాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. వైస్‌ చైర్మన్‌ చిగుర్ల శ్రీనివాస్‌, డైరెక్టర్లు అగిత రవిందర్‌, కాల్వ సురేశ్‌, చౌటపల్లి రంజిత్‌, జిల్లెల్ల పర్శరా ములు, దాడి ఆంజనేయులు, దాడి సదయ్య, దానే ఓదెలు, ముక్కెర సదానందం, సందవేణి ప్రసాద్‌, నాగారపు సత్యనారాయణ ఉన్నారు.

చిగురుమామిడి: ఇంటర్‌ విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్ధేశించుకుని క్రమశిక్షణతో చదవాలని డీఐఈవో వి.సత్యవర్ధన్‌రావు సూచించారు. మంగళవారం చిగురుమామిడి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. ఇంటర్‌లో ఉత్తీర్ణులైన వారు పైచదువులను సులభంగా పూర్తిచేస్తారని తెలిపారు. విద్యతో పాటు సామాజిక కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు. ప్రిన్సిపాల్‌ శశిధర్‌శర్మ, అధ్యాపకులు జనార్దన్‌, సంపత్‌, రవికుమార్‌, గోవర్దన్‌రెడ్డి, మహేందర్‌, అనిత, స్వరూప, మమత, చంద్రశేఖర్‌, రవి, కవిత పాల్గొన్నారు.

కరీంనగర్‌స్పోర్ట్స్‌: తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న తొలి విడత టీజీ ఐసెట్‌– 2026 కౌన్సెలింగ్‌లో భాగంగా మంగళవారం నాలుగో రోజు సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయినట్లు ప్రిన్సిపాల్‌ డి.శోభారాణి తెలిపారు. కరీంనగర్‌లోని డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్‌ మహిళా పాలిటెక్నిక్‌ కళాశా ల హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్న 333 మంది విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన చేసినట్లు ప్రిన్సిపాల్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement