● ప్రైవేట్ ఆస్పత్రుల మధ్య ఆధిపత్య పోరు
● మెట్‌పల్లిలో గొడవలకు దిగుతున్న వైనం
● ఇటీవల ఓ వైద్యుడిపై కేసు నమోదు ● పట్టణంలో 25కు పైగా ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. ఇందులో కొన్ని వైద్యులు సొంతంగా నడిపిస్తున్నవి. మరికొన్ని నాన్ వైద్యులు మేనేజ్‌మెంట్‌గా ఉండి నిర్వహిస్తున్నవి ఉన్నాయి.
● ప్రైవేట్ ఆస్పత్రుల సంఖ్య పెరిగిపోతుండడంతో వారి మధ్య పోటీ తీవ్రమైంది.
● మరోవైపు నిర్వహణ భారంగా మారడంతో కొందరు వైద్యులు, నిర్వాహకులు ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
● ప్రధానంగా చాలావరకు ఆస్పత్రులు గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే ఆర్‌ఎంపీల మీద ఆధారపడి ఉన్నాయి. వారి ద్వారా రోగులను ఆస్పత్రులకు రప్పించుకునేందుకు పెద్ద మొత్తంలో కమీషన్లు ఆశ చూపుతున్నారు. సాధారణంగా ఒక బిల్లు మీద 20 నుంచి 30శాతం వరకు కమీషన్ అందిస్తుండగా.. పోటీ నేపథ్యంలో ప్రస్తుతం ఓ వైద్యుడు 60శాతం వరకు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
● ఇలా పోటీ పడి కమీషన్లు ఇస్తుండడం కొందరికి ఇబ్బందిగా మారింది.
● ఈ క్రమంలోనే మార్కెట్‌లో ఒకరిపై ఒకరు దుష్ప్రచారం చేయడమే కాకుండా ఆస్పత్రులు, వైద్యులకు సంబంధించిన లోటుపాట్లపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
● ఈ కారణాలతో కొంతకాలంగా ప్రైవేట్ ఆసుపత్రుల మధ్య అంతర్గతంగా నెలకొన్న విభేదాలు తాజాగా వైద్యుడిపై కేసుతో బహిర్గతమయ్యాయి.
● కొందరు వైద్యులు, ఆస్పత్రుల నిర్వాహకులు ఆదాయార్జన కోసం వైద్య వృత్తికి సంబంధించి నైతిక విలువలకు తిలోదకాలిస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
● రోగులను రప్పించుకునేందుకు ఆర్‌ఎంపీలకు పోటాపోటీగా కమీషన్లు ఇస్తున్న నిర్వాహకులు.. ఆ భారాన్ని రోగులపైనే మోపుతున్నారు.
● ఇందుకోసం అవసరం లేని పరీక్షలు, అడ్డగోలు మందులు రాస్తూ అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
● వైద్యశాఖ అధికారులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు జోక్యం చేసుకుని గాడితప్పిన ప్రైవేట్ వైద్యాన్ని చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.
మెట్‌పల్లి: మెట్‌పల్లిలో కొందరు ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు, వైద్యుల తీరు వివాదాస్పదమవుతోంది. ఏమాత్రం సేవాభావం లేకుండా వైద్యం పేరుతో కాసులవేట సాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తీవ్రమైన పోటీ పెరిగి వారి మధ్య గొడవలకు దారి తీస్తోంది. తాజాగా ఓ వైద్యుడిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడం గమనార్హం. వైద్యం విషయంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండడానికి బదులు వ్యక్తిగత విభేదాలు, ఆధిపత్య పోరు, రోగుల కోసం దిగజారుడు పనులు చేయడం వంటివి ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
దుష్ప్రచారం.. ఫిర్యాదులు
రోగుల నిలువు దోపిడీ..
పట్టణంలో ఆత్మకూర్
రమేశ్ సాయిలక్ష్మీనివాస్ పేరిట ఆస్పత్రి ఏర్పాటు చేశాడు. అందులో కొన్నేళ్లు అశోక్‌రెడ్డి వైద్యుడి పనిచేశాడు. ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో అశోక్‌రెడ్డి తప్పుకొని సాయిలక్ష్మీనివాస్ ఆస్పత్రి పక్కనే సొంతంగా మరొకటి నెలకొల్పాడు. అయితే.. తనపట్ల రమేశ్ దుష్ప్రచారం చేస్తున్నాడనే అనుమానంతో ఆదివారం వేకువజామున అశోక్‌రెడ్డి అతడి ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. దీనిపై రమేశ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు అశోక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ప్రమాణాలు పాటించాలి
వైద్యులు, ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు వైద్యసేవల విషయంలో తప్పనిసరిగా నైతిక ప్రమాణాలు పాటించాలి. ఆదాయమే లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదు. రోగులను రప్పించుకోవడానికి కమీషన్ల ఆశ చూపుతూ ఆర్‌ఎంపీలను ప్రోత్సహించడం మానుకోవాలి. ప్రతి ఆస్పత్రిలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పాటించాలి. ఇటీవల మెట్‌పల్లిలో నిబంధనలు ఉల్లంఘించిన రెండింటికి నోటీసులు ఇచ్చాం.
– జైపాల్‌రెడ్డి, జిల్లా ఉప వైద్యాధికారి