సిరిసిల్లటౌన్: దేశం గర్వించేలా విక్రమ్–1 రాకెట్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మన జిల్లా ఇంజినీర్లను యువత ఆదర్శంగా తీసుకోవాలని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రం సిరిసిల్లలో మంగళవారం శ్రీనాగుల మల్లయ్యశ్రీఅవార్డుల కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. స్వాతంత్య్ర సమర యోధుడు, జిల్లాలో బీసీలు రాజకీయంగా ఎదగడానికి కృషి చేసిన నాయకుడు ‘నాగుల మల్లయ్య’ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిగా పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో మెరిసిన జిల్లా యువ ఆణిముత్యాలు సంతోష్‌కుమార్, కిరణ్, నాగరాజును సన్మానించి అవార్డులు అందజేశారు. 170 నిమిషాల్లో, 175 గ్రాముల బరువుతో అరుదైన చీరను చేనేత మగ్గంపై నేసిన వెల్ది హరిప్రసాద్ దంపతులను కూడా సత్కరించారు. అవార్డు కమిటీ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, డైరెక్టర్లు నాగుల సంతోష్‌గౌడ్, ఎండీ సలీం, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు సూర దేవరాజు, కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ ఆడెపు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. అంతకముందు యువ ఇంజినీర్లు అడుప సంతోష్‌కుమార్, అడుప కిరణ్, బొమ్మదేని నాగరాజు మంగళవారం సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో శ్రీకృష్ణ దేవరాయ హై స్కూల్, కాకతీయ హై స్కూల్, వికాస్ డిగ్రీ కాలేజీ పక్షాన సన్మానించారు.
విప్ ఆది శ్రీనివాస్


