పెళ్లికార్డులో ప్రకృతిపై ప్రేమ | - | Sakshi
Sakshi News home page

పెళ్లికార్డులో ప్రకృతిపై ప్రేమ

Aug 5 2026 1:47 AM | Updated on Aug 5 2026 1:47 AM

సాధారణంగా పెళ్లి కాగానే కార్డును బయట పడేస్తాం. కానీ, ఈ కార్డును బయట పడేయకుండా మట్టికుండీలో పెట్టి పైన మట్టిని వేసి నీరు పోస్తే వారం రోజుల వరకు కార్డు మట్టిలో కరిగిపోయి అందులోంచి తులసీ మొక్క బయటకు రావడం విశేషం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన మంచాల జ్ఞానేందర్‌ గుప్తా వ్యాపారరీత్యా నిజామాబాద్‌ జిల్లాకేంద్రంలో ఉంటున్నాడు. నిరుపేదల కోసం సిరిసిల్ల, నిజామాబాద్‌, హైదరాబాద్‌లో ఉచిత స్వర్గలోక యాత్ర వాహనాలు, బాడీ ఫ్రీజర్‌లు సమకూరుస్తున్న ఆయన కూతురు వివాహానికి వినూత్నంగా ఆలోచించాడు. పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేలా కార్డును తయారు చేయించాడు. పెళ్లి అయిన తర్వాత మంచిరోజు చూసుకుని ఆహ్వానపత్రికను మట్టితో కూడి పాత్రలో పెట్టాలని, వారంరోజులకు తులసీ మొక్క వస్తుందని పేర్కొన్నాడు. పర్యావరణ పరిరక్షణకు తనవంతు కృషి చేస్తున్నట్లు వివరించాడు.

– కోనరావుపేట(వేములవాడ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement