బైక్‌ నంబరు మార్చేసుకున్నారు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ నంబరు మార్చేసుకున్నారు

Aug 4 2026 12:53 AM | Updated on Aug 4 2026 12:53 AM

● నకిలీ నంబరుతో తిరిగి పట్టుబడ్డారు ఆర్టీఏ ఇచ్చిన నంబరే వాడాలి

● నకిలీ నంబరుతో తిరిగి పట్టుబడ్డారు

పెద్దపల్లిరూరల్‌: రోడ్లపై తిరిగే బైక్‌ నంబర్లను టాంపరింగ్‌ చేసి ట్రాఫిక్‌ పోలీసులు విధించే చలాన్ల నుంచి తప్పించుకునేందుకు కొందరు యత్నిస్తుంటే.. ఇంకొందరు ఏకంగా వాహన నంబరునే మార్చేసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం పెద్దపల్లిలో ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖిల్లో నకిలీ నంబరు(టీఎస్‌ 19ఏ 9821)తో హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌బైక్‌ తిరుగుతున్నట్టు గుర్తించి దానిని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఇదే నంబరుగల బైక్‌ హైదరాబాద్‌లో ఉన్నట్టు తేలింది. ఇక్కడి ట్రాఫిక్‌ పోలీసులు చలాన్‌ విధిస్తే ఆ నంబరు యజమాని సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు వెళ్తున్నాయి. దీంతో నకిలీ నంబరు వినియోగిస్తున్న బైక్‌ యజమాని పెద్దపల్లి పట్టణంలోని కొంతంవాడకు చెందిన వీరేశంపై కేసు నమోదు చేశారు. ఈబైక్‌ యజమాని తన అవసరాల నిమిత్తం ఓ వ్యాపారి వద్ద కుదువపెట్టగా.. సదరు వ్యాపారి ఇలా బోగస్‌ నంబరుతో తిరిగాడని వీరేశం పోలీసులకు వివరించినట్టు తెలిసింది.

వాహనదారులు రవాణశాఖ కేటాయించిన నంబరునే వాహనంపై రాయాలి. వాహనానికి అమర్చిన నంబరు ప్లేటును టాంపరింగ్‌ చేసినా, నకిలీ, బోగస్‌ నంబర్లు వినియోగిస్తున్నట్లు తేలినా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ సీఐ, పెద్దపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement