స్నేహితుల దినోత్సవం రోజు విషాదం | - | Sakshi
Sakshi News home page

స్నేహితుల దినోత్సవం రోజు విషాదం

Aug 2 2026 11:55 PM | Updated on Aug 2 2026 11:55 PM

● ఎల్‌ఎండీలో మునిగి యువకుడు..

● కుంటలో పడి బాలుడి మృతి

● కరీంనగర్‌ జిల్లాలో విషాదం

తిమ్మాపూర్‌/శంకరపట్నం: స్నేహితుల దినో త్సవం రోజు కరీంనగర్‌ జిల్లాలో విషాదం నెలకొంది. స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో నీట మనిగి చనిపోయారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ 8వ డివిజన్‌ అలుగునూర్‌కు చెందిన గోల్కొండ మణి ప్రసాద్‌ (23) తిమ్మాపూర్లో హోటల్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం స్నేహితుల దినోత్స వం సందర్భంగా నలుగురు స్నేహితులతో కలిసి రోజంతా ఆనందంగా గడిపారు. సాయంత్రం లో యర్‌ మానేరు జలాశయంలోని మినీ బీచ్‌ తీరాన నీళ్లలో ఆనందంగా గడుపుతున్న సమయంలో ప్రసాద్‌ ప్రమాదవశాత్తు నీటిలో మునిగాడు. స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై అన్వర్‌ తెలిపారు.

కుంటలో మునిగి బాలుడు మృతి

జిల్లాలోని శంకరపట్నం మండలం మొలంగూర్‌ గ్రామంలో స్నేహితులతో కలిసి కుంటలో ఈతకు వెళ్లిన బాలుడు నీటమునిగి చనిపోయాడు. బిహర్‌కు చెందిన వీనాసాహిని– భవితదేవి దంపతులు మొలంగూరుకు వలస వచ్చారు. వీరి పెద్ద కొడుకు రితిక్‌కుమార్‌(8) మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గ్రామంలోని అల్లయ్యకుంటలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈజీఎస్‌ పథకంలో పూడికతీత పనులు చేపట్టిన ప్రాంతంలో రితిక్‌ మునిగిపోయాడు. మిగతా ఇద్దరు ఇంటికి వెళ్లి వీనాసాహినికి విషయం చెప్పడంతో గ్రామస్తులతో కలిసి కుంట వద్దకు చేరుకుని నీటిలో గాలించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నోట్లోంచి నీళ్లు వస్తుండంతో బతికున్నాడనే ఆశతో కారులో హుజూరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్థారించారు. పోస్టుమార్టం అనంతరం రితిక్‌కుమార్‌ అంత్యక్రియలు మొలంగూర్‌లో నిర్వహించారు.

గోదావరిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం

మల్లాపూర్‌: మండలంలోని ఒబులాపూర్‌ శివారు గోదావరిలో ఆదివారం గుర్తు తెలి యని మహిళ మృతదేహం కనిపించింది. స్థా నికుల సమాచారం మే రకు ఎస్సై అనిల్‌, పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. మహిళ వయస్సు 25 నుంచి 30 ఏళ్ల వరకు ఉంటుందని, ఎరుపు, ఆకుపచ్చ రంగు గాజులు, నావి బ్లూ టాప్‌, పసుపు రంగు ప్యాంట్‌ ధరించి ఉందని, చేతిపై అమ్మ అనే టాటూ ఉందని, ఎవరైనా ఆమెను గుర్తిస్తే 87126 56796 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement