అగ్రగామిగా నిలుపుతా | - | Sakshi
Sakshi News home page

అగ్రగామిగా నిలుపుతా

Aug 2 2026 11:49 PM | Updated on Aug 2 2026 11:49 PM

కరీంనగర్‌ కార్పొరేషన్‌: అభివృద్ధిలో కరీంనగర్‌ను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం నగరపాలక సంస్థ 24వ డివిజన్‌లోని బ్యాంకుకాలనీలో రూ.50లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర అభివృద్ధిపైనే తాను ప్రస్తుతం దృష్టి సారించినట్లు తెలిపారు. మరిన్ని నిధులు తీసుకువచ్చి నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. తమ కాలనీలో అభివృద్ధి పనులు చేపడుతున్న సందర్భంగా సంజయ్‌ని స్థానిక ముస్లిం మహిళలు సత్కరించారు. మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ వై.సునీల్‌రావు, కార్పొరేటర్లు సత్యనారాయణరెడ్డి, వేణు పాల్గొన్నారు.

అవగాహన లేని కాంగ్రెస్‌ నాయకులు

రామడుగు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాళేశ్వ రం ప్రాజెక్టుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ విమర్శించారు. రామడుగు మండలంలోని లక్ష్మీపూ ర్‌ గాయత్రి పంపుహౌస్‌ను ఆదివారం మాజీ మంత్రులు టి.జీవన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, ఎమ్మెల్సీ రమణ, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ లక్ష్మీపూర్‌ పంపుహౌస్‌ నుంచి కాళేశ్వరం నీటిని ఎత్తిపోస్తున్నారని, ప్రాజెక్టును కూలేశ్వ రం ప్రాజెక్టు అని కాంగ్రెస్‌ నాయకులు ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ వద్ద 5లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పో తోందన్నారు. ప్రభుత్వం మేడిగడ్డ నుంచి నీటి ని పంపింగ్‌ చేయాలని కోరారు. టీపీసీసీ ఆధ్యక్షులు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ప్రాజెక్టుపై అవగాహన తరగతులను నిర్వహించాలని సూచించారు. రామడుగు సింగిల్‌ విండో చైర్మన్‌ వీర్ల వెంకటేశ్వర్‌రావు, రవీందర్‌సింగ్‌, కొత్త జయపాల్‌రెడ్డి, రామకృష్ణారావు, రవీందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఆటా వేడుకల్లో శాతవాహన వీసీ

కరీంనగర్‌సిటీ: అ మెరికాలోని మేరీ ల్యాండ్‌ వేదికగా అమెరికా తెలుగు సంఘం(ఆటా) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 19వ ఆటా కాన్ఫరెన్స్‌ యూత్‌ కన్వెన్షన్‌ వేడుకల్లో శాతవాహన విశ్వవిద్యాలయ వీసీ యు.ఉమేశ్‌కుమార్‌ పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, విద్యా వికాసమే లక్ష్యంగా జరుగుతున్న వేడుకల్లో వీసీ భాగస్వాములు కావడం విశ్వవిద్యాలయ వర్గాలకు ఎంతో గర్వకారణమని శాతవాహన అధికారులు తెలిపారు.

శిశిర యామిని కథల సంకలనం ఆవిష్కరణ

కరీంనగర్‌ కల్చరల్‌: మలిసంధ్యలోని పెద్దల బాధలను ప్రతిబింబించే కథలతో రూపొందిన ‘శిశిర యామిని’ కథల సంకలనాన్ని ఆదివారం నగరంలోని చార్వాక నిలయంలో ఆవిష్కరించారు. సంకలన సంపాదకుడు ఇటిక్యాల రాము, దామరకుంట శంకరయ్య సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పెద్దల జీవితాల్లోని అనుభవాలు, సమస్యలు, భావోద్వేగాలకు అక్షరరూపమే ఈ సంకలనం అని పేర్కొన్నారు. పుస్తకం రూపుదిద్దుకున్న తీరు, ప్రచురణ నేపథ్యాన్ని వివరించారు. పుస్తకంలోని కథలను విలాసాగరం రవీందర్‌ సమీక్షిస్తూ.. వృద్ధుల జీవిత వాస్తవాలను హృదయానికి హత్తుకునేలా రచయితలు ఆవిష్కరించారన్నారు. రచయితలు నూటింకి రవీంద్ర, దేవి యాదగిరి, సీవీ.కుమార్‌, నడిమెట్ల రామయ్య, నెరువట్ల చైతన్య, చంద్రయ్య, మంచికట్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement