● మూతబడే దశలో మద్దికుంట పాఠశాల | - | Sakshi
Sakshi News home page

● మూతబడే దశలో మద్దికుంట పాఠశాల

Aug 2 2026 11:49 PM | Updated on Aug 2 2026 11:49 PM

● మూతబడే దశలో మద్దికుంట పాఠశాల

మానకొండూర్‌: ఒకప్పుడు విద్యార్థులతో కళకళలా డిన పాఠశాల ఇప్పుడు వెలవెలబోతోంది. సకల సౌకర్యాలు ఉన్నా పిల్లలు సర్కారు బడి వైపు చూడకపోవడంతో మూతబడే దశకు చేరుకుంది మానకొండూర్‌ మండలం మద్దికుంటలోని ప్రభుత్వ ప్రా థమిక పాఠశాల.ప్రస్తుతం ఇద్దరు విద్యార్థులు చదువుతుండగా.. వారికి ఇద్దరు ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. గ్రామంలో 72మంది చిన్నారులు ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న వారు ఉన్నారు. వారు ప్రైవేటుతో పాటు మోడల్‌, గురుకుల పాఠశాలల్లో చదువుతున్నట్లు విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి. మద్దికుంట ప్రభుత్వ పాఠశాలలో ఈ ఏడాది ఒక్క అడ్మిషన్‌ కాకపోగా.. ఉన్న ఇద్దరిలో శివకుమార్‌ 5వ తరగతి, హర్షవర్ధన్‌ 4వ తరగతి చదువుతున్నారు. వీరికి ఇద్దరు ఉపాధ్యాయులు చదువు చెబుతున్నారు. మధ్యాహ్న భోజన ని ర్వాహకురాలు సరోజన భోజనం వండి పెడుతున్నారు. ఇద్దరికి నెలంతా వండితే రూ.96 బిల్లు వస్తోందని తెలిపారు. రెండేళ్లు గడిస్తే ఈ ఇద్దరు కూడా పై తరగతులకు వెళ్తారని, బడిని బతికించేందుకు గ్రామస్తులతో పాటు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సర్పంచ్‌ బుర్ర శ్రీధర్‌ కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement