కరీంనగర్‌క్రైం: పాఠశాలల్లో బాలల హక్కులను పరిరక్షించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యా య సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్.శివకుమార్ పేర్కొన్నారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మిషన్ బాల సురక్ష, శిక్షా, న్యాయ–2026’ కార్యక్రమంలో భాగంగా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులుగా నియామకమైన ఉపాధ్యాయులకు జిల్లా కోర్టు ఆవరణలో శని వారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ బాలలపై వేధింపులు, పోక్సో చట్టం కింద నేరాలు, బా ల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను అరికట్టేందుకు ఉపాధ్యాయులకు చట్టాలపై పూర్తి అవగాహన అవసరం అన్నారు. జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి, సీని యర్ సివిల్ జడ్జి కె.రాణి ఆధ్వర్యంలో బాలల హక్కులు, ఉచిత న్యాయ సేవలు, చట్టపరమైన రక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి డి.వెంకటేశ్, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నామ సంతోష్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి పాల్గొన్నారు.
చొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదు గడువు తేదీని అగస్టు 7వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ కె.బ్రహ్మానందరెడ్డి తెలిపారు. పరీక్ష నవంబర్ 28న జరుగుతుందని, 2027–28 విద్యా సంవత్సరంలో ఆరోతరగతిలో ప్రవేశం కోరబోయే విద్యార్థులు 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ ఆమోదం పొందిన ప్రైవేటు పాఠశాలల్లో ఐదోతరగతి చదువుతూ ఉండాలని సూచించారు. ఈ ఏడాది జగిత్యాల జిల్లాలోనూ నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని జగిత్యా ల, మల్యాల, మెట్‌పల్లి బ్లాక్‌ల విద్యార్థులు జగిత్యాల జిల్లాలోని నవోదయలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల వేతనాలు శనివారం బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు నగరపాలకసంస్థ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ ఒక ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ప్రతి నెల ఇదే తరహాలో 1వ తేదీనే క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
కరీంనగర్ అర్బన్: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం మరో అవకాశమిచ్చింది. గత నెల 31తో కేవైసీ గడువు ముగియగా మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నారుల ఆధార్ అప్‌డెట్ క్రమంలో ఆధార్ కేంద్రాలు కిక్కిరిసిపోగా వేలమంది చిన్నారులు రేషన్‌కు దూరమయ్యే అవకాశముంది. ఈ క్రమంలో గడువు పెంచాలన్న విజ్ఞప్తులతో ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈ నెల 31వరకు కేవైసీ చేసుకోవచ్చని, సమీప రేషన్ దుకాణం లేదా మీ సేవ కేంద్రాల్లో కేవైసీ చేసుకోవాలని అధికారులు సూచించారు.
కరీంనగర్ క్రైం: కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఆగస్టు 31వరకు ని షేధాజ్ఞలు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు అడిషనల్ డీసీపీ వెంకటరమణ తెలి పారు. సంబంధిత ఏసీపీల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించొద్దన్నారు. మారణాయుధాలతో సంచరించడం, ప్రజా ప్రదేశాల్లో గుమికూడడం నిషేధమన్నా రు. డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, పారాగ్లైడర్ల వినియోగం, డీజే వినియోగంపై నిషేధాజ్ఞలను పొడిగించినట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించొద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యానగర్(కరీంనగర్): డీఐఈవోగా వి.సత్యవర్ధన్‌రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ప్రిన్సిపాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సత్యనారాంజనేయ, జిల్లా జూనియర్ కళాశాలల లెక్చరర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి కనకయ్య, రాజేశ్వర్ రావు, వెంకటరమణచారి, నిర్మల అభినందించారు.


