ట్రాఫిక్ జరిమానాలు ఇలా
ఏడు నెలల్లో కేసుల వివరాలు
కరీంనగర్‌క్రైం: నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై పోలీసులు కొరఢా ఝులిపిస్తున్నారు. 2026 జనవరి నుంచి జూలై వరకు నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీల్లో భారీసంఖ్యలో కేసులు నమోదు చేయడంతో పాటు రూ.కోట్లలో జరిమానాలు వేశారు. ఏడు నెలల్లో 2,63,781 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు చేసి, రూ.11,07,83,600 జరిమానా విధించారు. 1,587మందిపై డ్రంకెన్‌డ్రైవ్ కేసు నమోదు చేశారు.
జూలైలోనే అత్యధిక కేసులు
జూలైలో అత్యధిక సంఖ్యలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్క నెలలోనే 59,161 కేసులు నమోదు చేయగా.. రూ.1.62 కోట్లకు పైగా జరిమానా విధించారు. మే నెలలో అత్యధికంగా 293 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. జూన్‌లో 241, ఏప్రిల్‌లో 205, జనవరిలో 190, జూలైలో 182, ఫిబ్రవరిలో 111 మంది పట్టుబడ్డారు.
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా
హెల్మెట్ ధరించకపోవడం, సీట్‌బెల్ట్ వినియోగించకపోవడం, సిగ్నల్ ఉల్లంఘన, అధికవేగం, రాంగ్ రూట్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడమే తన ప్రధాన ఉద్దేశమని పోలీసులు పేర్కొంటున్నారు.
నెల కేసులు జరిమానా డ్రంకెన్ డ్రైవ్‌లు
జనవరి 32,373 రూ.1.84కోట్లు 190
ఫిబ్రవరి 18,703 రూ.1.06కోట్లు 111
మార్చి 27,753 రూ.1.37కోట్లు 365
ఏప్రిల్ 34,169 రూ.1.53కోట్లు 205
మే 42,991 రూ.1.96కోట్లు 293
జూన్ 48,631 రూ.1.67కోట్లు 241
జూలై 59,161 రూ.1.62కోట్లు 182
ట్రాఫిక్ కేసులు: 2,63,781
జరిమానాలు: రూ.11,07,83,600
డ్రంకెన్‌డ్రైవ్ కేసులు: 1,587


