పాఠశాలను సందర్శించిన డీఈవో | - | Sakshi
Sakshi News home page

పాఠశాలను సందర్శించిన డీఈవో

Jul 16 2026 5:00 AM | Updated on Jul 16 2026 5:00 AM

పాఠశాలను సందర్శించిన డీఈవో

వీణవంక: వీణవంక మండలం ఘన్ముక్కుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డీఈవో ప్రశాంత్‌రెడ్డి తనిఖీ చేశారు. ‘8 మంది టీచర్లు.. 9 మంది విద్యార్థులు’ శీర్షికతో బుధవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ విచారణ జరపాలని డీఈ వోకు ఆదేశాలు జారీ చేశారు. ఎంఈవో శోభారాణితో కలిసి డీఈవో పాఠశాలను సందర్శించారు. 9మంది విద్యార్థులకు 8మంది ఉపాధ్యాయులు ఉండటంపై విచారణ జరిపారు. బుధవారం ఆరుగురు విద్యార్థులు హాజరైనట్లు తెలుసుకున్నారు. సర్పంచ్‌ గాజుల శంకర్‌, ఉపసర్పంచ్‌ అనిల్‌రెడ్డి, వార్డు సభ్యులు పాఠశాలలో అధికారులతో చర్చించారు. త్వరలోనే పాఠశాలను మోడల్‌ స్కూల్లో కలిపేందుకు గ్రామస్తుల వాగ్మూలం తీసుకొన్నట్లు తెలిసింది. ఈ అంశంపై విచారణ జరిపామని, ఉన్నధికారులకు నివేదిక అందిస్తామని డీఈవో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement