వనమహోత్సవానికి సిద్ధం చేయాలి | - | Sakshi
Sakshi News home page

వనమహోత్సవానికి సిద్ధం చేయాలి

Jul 10 2026 7:22 AM | Updated on Jul 10 2026 7:22 AM

● బల్దియా కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: వన మహోత్సవానికి మొక్కలను సిద్ధం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ ఆదేశించారు. గురువారం నగరంలోని పద్మనగర్‌లోని నగరపాలక సంస్థ నర్సరీని సందర్శించారు. నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టబోయే వన మహోత్సవాన్ని అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. నగరవ్యాప్తంగా గు ర్తించిన స్థలాల ప్రకారం మొక్కలు నాటేందుకు గుంతలను తీయాలన్నారు. ఇన్‌చార్జి ఈఈ లచ్చిరెడ్డి, ఏఈ నర్మద పాల్గొన్నారు.

వందశాతం మ్యాపింగ్‌ చేయాలి

నగరంలోని ప్రతి బీఎల్‌వో వందశాతం ఓటర్‌ మ్యాపింగ్‌ చేయాలని కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ ఆదేశించారు. గురువారం నగరంలోని జ్యోతినగర్‌, మంకమ్మతోట, రేకుర్తి తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించారు. నగరంలో ఎక్కడా ఎవరూ విస్మరణకు గురికాకుండా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా సర్వే చేయాలన్నారు.

సర్‌కు సహకరించాలి

నగరంలో చేపడుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీలు సహకరించాలని ప్రఫుల్‌దేశాయ్‌ కోరారు. గురువారం నగరపాలకసంస్థ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. నగరంలో ఎస్‌ఐఆర్‌ జరుగుతున్న తీరుపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement