ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాలి
కరీంనగర్‌స్పోర్ట్స్: ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించేలా ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి 12వ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలపై సంపూర్ణ అవగాహన కలిగి, స్వతహాగా క్రీడాకారుడైన సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించినట్లు చెప్పారు. రాబోయే ఒలింపిక్స్ మొదలు ప్రతీ ప్రపంచ క్రీడా వేదికలపై తెలంగాణ క్రీడాకారులు మువ్వన్నెల జెండా ఎగరవేయాలనేది ప్రభుత్వ ఆశయమన్నారు. కాగా, 30 ఏళ్ల నుంచి మొదలుకొని 90 ఏళ్ల వయస్సు వారికి పోటీలు నిర్వహించారు. విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు అంజన్‌కుమార్, అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభుకుమార్‌గౌడ్, డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ చాట్ల శ్రీధర్, నీలం లక్ష్మణ్, డి.లక్ష్మి, కిషన్‌రావు, శిరీష, శాట్స్ రిటైర్డ్ ఏడీలు నాగిరెడ్డి సిద్ధారెడ్డి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం: ఎంపీ ఈటల
వయస్సు నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడల్లో భాగస్వాములు కావాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. 800 మీటర్ల రన్నింగ్‌ను ప్రారంభించి మాట్లాడారు. ఆటలు ఆటవిడుపుగానే కాకుండా ఆరోగ్యకర జీవనానికి దోహదపడుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పాఠశాల మొదలు కళాశాల అన్ని స్థాయిల్లో ప్రతిభావంతుల్ని గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఖేలో ఇండియా కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, వరాల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కవాతు
పోటీల్లో భాగంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మాస్టర్ అథ్లెట్ల మార్చ్‌ఫాస్ట్ ఆకట్టుకుంది. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగారెడ్డి జిల్లాకు ప్రథమ, ని జామాబాద్‌కు ద్వితీయ బహుమతులను మంత్రి పొ న్నం, విప్ ఆది, ఎమ్మెల్యే కవ్వంపల్లి అందజేశారు.
బెస్ట్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ దివ్యారెడ్డి
అథ్లెటిక్స్ పోటీల్లో భాగంగా బెస్ట్ ఇయర్ ఆఫ్ ది మాస్టర్ అథ్లెట్ అవార్డును బి.దివ్యారెడ్డి (మేడ్చల్)కి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి అందజేశారు. 45 ఏళ్ల వయస్సు విభాగంలో 800 మీటర్ల రన్నింగ్‌ను 3.33 నిమిషాల్లో చేరుకొని బంగారు పతకం సాధించింది. అలాగే కొన్నేళ్లుగా 100, 400, 800 మీటర్ల రన్నింగ్‌లో పాల్గొని బంగారు పతకాలు కై వసం చేసుకుంది. దీంతో అవార్డును ప్రదానం చేశారు.
క్లాప్ కొట్టి పోటీలను ప్రారంభిస్తున్న ఎంపీ ఈటల రాజేందర్
మాట్లాడుతున్న మంత్రి పొన్నం, చిత్రంలో విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే సత్యనారాయణ తదితరులు
మంత్రి పొన్నం ప్రభాకర్
ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాలి
ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాలి
ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాలి


