హోరాహోరీగా కబడ్డీ పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో శనివారం క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. పురుషుల విభాగంలో సూర్యపేట, జనగాం, నిజామాబాద్ జట్లు క్వార్టర్స్‌లో అడుగుపెట్టాయి. మహిళల విభాగంలో హైదరాబాద్ 2, రంగారెడ్డి జట్లు సెమీస్‌లో చేరగా ఆదివారం వరంగల్, గద్వాల్ జట్లు, కరీంనగర్, ఖమ్మం జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. పోటీలను విప్ ఆది శ్రీనివాస్ క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు. కాగా స్టేడియంలో రాత్రి మంచు ఎక్కువగా కురవడంతో టెక్నీకల్ కమిటీ బాధ్యులు అనిల్‌కుమార్, శ్రీనివాస్ పోటీలను వాయిదా వేశారు. పురుషుల విభాగంలో హనుమకొండ– నల్గొండ, మేడ్చల్– రంగారెడ్డి జట్లు, మహిళల విభాగంలో గద్వాల్, వరంగల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లను ఆదివారం తిరిగి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో కరీంనగర్ పురుషుల జట్టు జనగాం జట్టుతో తలపడగా 51–21 స్కోర్‌తో ఓటమి చెందింది. మహిళల జట్టు సూర్యపేటపై 43–13 స్కోర్‌తో క్వార్టర్స్‌కు చేరింది. ఆదివారంతో పోటీలు ముగియనున్నట్లు సంఘం బాధ్యులు తెలిపారు. బహుమతి ప్రదానోత్సవ కా ర్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ హాజరుకానున్నట్లు పేర్కొన్నా రు. కబడ్డీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అ మిత్‌కుమార్, మల్లేశ్‌గౌడ్, సీహెచ్ సంపత్‌రావు, ల క్ష్మీనారాయణ, ఎల్లాగౌడ్, మల్లేశం, మహేందర్‌రెడ్డి, రవీందర్, పోలీస్ అధికారులు భీంరావు, విజయ్‌కుమార్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
మహిళల సెమీస్‌లో హైదరాబాద్– 2, రంగారెడ్డి జట్లు
నేడు ముగింపు.. హాజరుకానున్న కేంద్ర మంత్రి బండి సంజయ్


