శాసీ్త్రయ దృక్పథం పెంపొందించాలి | - | Sakshi
Sakshi News home page

శాసీ్త్రయ దృక్పథం పెంపొందించాలి

Dec 27 2025 7:54 AM | Updated on Dec 27 2025 7:54 AM

శాసీ్త్రయ దృక్పథం పెంపొందించాలి

శాసీ్త్రయ దృక్పథం పెంపొందించాలి

● కలెక్టర్‌ పమేలా సత్పతి

కొత్తపల్లి(కరీంనగర్‌): విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలని, అందుకు చెకుముకి సంబరాలు, సైన్స్‌ ఫెయిర్‌ దోహదం చేస్తాయని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పద్మనగర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో శుక్రవారం నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి చెకుముఖి పోటీలను కలెక్టర్‌ ప్రారంభించారు. విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ ప్రతీ అంశాన్ని శాసీ్త్రయ కోణంలో ఆలోచించాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్‌ ఫెయిర్‌, చెకుముకి సంబరాలు వంటివి ఉపకరిస్తాయన్నారు. విద్యార్థులు ముఖ్యంగా గణితం, సైన్స్‌ సబ్జెక్టులపై దృష్టి పెట్టాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో సైన్స్‌ ప్రయోగశాలలను తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. తాను గతంలో సైంటిస్ట్‌గా పని చేశానని గుర్తు చేశారు. జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు చెలిమెల రాజేశ్వర్‌, జేవీవీ రాష్ట్ర కార్యదర్శి పి.మనీంద్రం, సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌ మోహన్‌రావు, నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ ప్రసాదరావు, చక్రపాణి, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్‌ రాంబాబు, జిల్లా సైన్స్‌ అధికారి జయపాల్‌రెడ్డి, విద్యాశాఖ కోఆర్డినేటర్‌ అశోక్‌రెడ్డి, జేవీవీ వైస్‌ ప్రెసిడెంట్‌ లక్ష్మారెడ్డి, నాయకులు ఆనంద్‌కుమార్‌, వెంకటేశ్వరరావు, రామచంద్రయ్య, శ్రీకాంత్‌, వరప్రసాద్‌, అందే సత్యం, సీహెచ్‌ రామరాజు, ఆర్‌.వెంకటేశ్వరరావు, ఎన్‌.దేవేందర్‌, గంగారాం, శంకర్‌, రమేశ్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement